రండి ఉత్సాహించి పాడుదము - YouWorship
Randi Utsaahinchi Paadudamu
Artist: సమూయేలు పాక్యనాధము
Category: Praise
Song Lyrics
రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే (2) రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికేగుదము (2) సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము ||రండి|| మన ప్రభువే మహా దేవుండు ఘన మహాత్యము గల రాజు (2) భూమ్యాగాధపు లోయలును భూధర శిఖరములాయనవే ||రండి|| సముద్రము సృష్టించెనాయనదే సత్యుని హస్తమే భువిజేసెన్ (2) ఆయన దైవము పాలితుల ఆయన మేపెడి గొర్రెలము ||రండి|| ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము (2) ఆయన మాటలు గైకొనిన అయ్యవి మనకెంతో మేలగును ||రండి|| తండ్రి కుమార శుద్దాత్మకును తగు స్తుతి మహిమలు కల్గు గాక (2) ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములనౌను ఆమెన్ ||రండి|| Randi Utsaahinchi Paadudamu Rakshana Durgamu Mana Prabhuve (2) Randi Kruthagnatha Sthothramutho Raaraaju Sannidhikegudamu (2) Sathprabhu Naamamu Keerthanalan Santhosha Gaanamu Cheyudamu ||Randi|| Mana Prabhuve Maha Devundu Ghana Mahaathyamu Gala Raju (2) Bhoomyaagaadhapu Loyalunu Bhoodhara Shikharamulaayanave ||Randi|| Samudramu Srushtinchenaayanade Sathyuni Hasthame Bhuvijesen (2) Aayana Daivamu Paalithula Aayana Mepedi Gorrelamu ||Randi|| Aa Prabhu Sannidhi Mokarinchi Aayana Mundara Mrokkudamu (2) Aayana Maatalu Gaikonina Ayyavi Manakentho Melagunu ||Randi|| Thandri Kumaara Shudhdhaathmakunu Thagu Sthuthi Mahimalu Kalgu Gaaka (2) Aadini Ippudu Ellappudu Ainatlu Yugamulanounu Aamen ||Randi||