యోర్దాన్నది దరిని భ్రమింపకు - YouWorship
Yordaannadi Darini Bhramimpaku
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యోర్దాన్నది దరిని భ్రమింపకు మనసా (1) యోచనచే చింతపడకు నా డెందమా (2) 1. ప్రవాహ మెక్కిన శక్తిని వీడకు (2) - దివ్య ప్రభుని వాక్కు మారదెన్నడు (2) 2. వాక్యానుసారము పాదము పెట్టుము - ఏక దేవుడేసు మాటతప్పడు 3. ఉన్నతరాజగు యేసు నీ దళకర్త - అన్ని శ్రమల నుండి కాచు నిక్కము 4. కానాను చెంతను ప్రియుని రాజ్యము - కాంచెద దేశంబు నిత్యానందము 5. ప్రేమ పాల్ తేనెయు పారెడి దేశము - పాటచే దానివర్ణింప వీల్పడదు 6. ప్రార్థన శక్తిచే విజయుల రాజ్యము - ప్రకాశ వస్త్రముల ధరింతు మచ్చట Pallavi: Yordaannadi Darini Bhramimpaku Manasaa (1) Yochanache Chinthapadaku Naa Dendamaa (2) 1. Pravaaha Mekkina Shakthini Veedaku (2) - Divya Prabhuni Vaakku Maaradennadu (2) 2. Vaakyaanusaaramu Paadamu Pettumu - Eka Devudesu Maatathappadu 3. Unnatharaajagu Yesu Nee Dalakartha - Anni Shramala Nundi Kaachu Nikkamu 4. Kaanaanu Chenthanu Priyuni Raajyamu - Kaancheda Deshambu Nithyaanandamu 5. Prema Paal Theneyu Paaredi Deshamu - Paatache Daanivarnimpa Veelpadadu 6. Praarthana Shakthiche Vijayula Raajyamu - Prakaasha Vasthramula Dharinthu Machchata