యేసు శీఘ్రముగ తిరిగివచ్చున్ - YouWorship
Yesu Sheeghramuga Thirigivachchun
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసు శీఘ్రముగ తిరిగివచ్చున్ - సత్యదేవుని వాక్యమిదే (1) ఆయన రాకడ అంత్య గుర్తులు - అన్నియు నెరవేరుచున్నవి యేసు శీఘ్రముగ తిరిగివచ్చున్ (1) 1. పాపదుఃఖములు పెరుగుచున్నవి - యుద్దకలహములు వృద్ధియాయెను (2) జనముపై జనము లేచుచున్నది - రాజ్యముపై రాజ్యము లేచుచున్నది (2) 2. భూకంపములు భువిని జరుగుచుండె - లోకమున తెగులు కరువు లున్నవి ఆకసమున భయసూచనలు - వీక్షింతురు వింత సూచనలు 3. విశ్వాసులు పైకి ఎత్తబడన్ - యేసు పరమునుండి దిగివచ్చును యేసుతో వెయ్యేండ్లు ఏలెదురు - ఆశతో కనిపెట్టుకొనువారలు 4. మారుమనస్సు నొందుమీ క్షణమే - కోరు యేసు రక్తాన కడుగుమని ఈ రోజున నీవు సిద్ధపడుము - పరలోకమున ప్రవేశింతువు Pallavi: Yesu Sheeghramuga Thirigivachchun - Sathyadevuni Vaakyamide (1) Aayana Raakada Anthya Gurthulu - Anniyu Neraveruchunnavi Yesu Sheeghramuga Thirigivachchun (1) 1. Paapaduhkhamulu Peruguchunnavi - Yuddakalahamulu Vruddhiyaayenu (2) Janamupai Janamu Lechuchunnadi - Raajyamupai Raajyamu Lechuchunnadi (2) 2. Bhookampamulu Bhuvini Jaruguchunde - Lokamuna Thegulu Karuvu Lunnavi Aakasamuna Bhayasoochanalu - Veekshinthuru Vintha Soochanalu 3. Vishvaasulu Paiki Eththabadan - Yesu Paramunundi Digivachchunu Yesutho Veyyendlu Eleduru - Aashatho Kanipettukonuvaaralu 4. Maarumanassu Nondumee Kshaname - Koru Yesu Rakthaana Kadugumani Ee Rojuna Neevu Siddhapadumu - Paralokamuna Praveshinthuvu