యేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి - YouWorship
Yesu Sheeghramugaa Vachchun Aashatho Kanipettudi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి (2) 1. గురుతులెల్ల లోకమంతా - సరిగజూడ కాననగున్ (2) పరిశుద్ధమైన ప్రవర్తనతో - ప్రభుకై కనిపెట్టుడి (2) 2. ప్రొద్దు గ్రుంకి వచ్చునేమో - అర్ధరాత్రి యందేమో ఉదయంపు కోడికూతలప్పుడు - వచ్చునేమో కనిపెట్టుడి 3. సిద్ధపడుడి మీరిలలో - మీరు దేవుని సంధింప సిద్ధపడుడి తీర్పునకై - ప్రభువుకై కనిపెట్టుడి 4. పరిశుద్ధులై జీవించుడి - ప్రభుని చిత్తము చేయుడి మరణమేసు నందె సుమ్మా - మేలుకొని కనిపెట్టుడి 5. యేసువలె జీవించుడి - తీసి వేయుడి మలినములన్ మోసంపుటాశల నన్ని విడచి - ఆశతో కనిపెట్టుడి 6. వేషధారణ విడచి - యేసు ముద్రల ధరించి పెండ్లి కుమారుని సంధింప - అందరు కనిపెట్టుడి 7. మేఘములపై వెళ్ళిన ప్రభు - వేగముగ వచ్చునిల సకల శ్రమలను భరించి - హల్లెలూయ పాడుడి Pallavi: Yesu Sheeghramugaa Vachchun Aashatho Kanipettudi (2) 1. Guruthulella Lokamanthaa - Sarigajooda Kaananagun (2) Parishuddhamaina Pravarthanatho - Prabhukai Kanipettudi (2) 2. Proddu Grungki Vachchunemo - Ardharaathri Yandemo Udayampu Kodikoothalappudu - Vachchunemo Kanipettudi 3. Siddhapadudi Meerilalo - Meeru Devuni Sandhimpa Siddhapadudi Theerpunakai - Prabhuvukai Kanipettudi 4. Parishuddhalai Jeevinchudi - Prabhuni Chiththamu Cheyudi Maranamesu Nande Summaa - Melukoni Kanipettudi 5. Yesuvale Jeevinchudi - Theesi Veyudi Malinamulan Mosamputaashala Nanni Vidachi - Aashatho Kanipettudi 6. Veshadhaarana Vidachi - Yesu Mudrala Dharinchi Pendli Kumaaruni Sandhimpa - Andaru Kanipettudi 7. Meghamulapai Vellina Prabhu - Vegamuga Vachchunila Sakala Shramalanu Bharinchi - Hallelooya Paadudi