యేసు రాజ్యమునకు సైనికులం - YouWorship
Yesu Raajyamunaku Sainikulam
Artist: సాయారం గట్టు
Category: Encouraging
Song Lyrics
యేసు రాజ్యమునకు సైనికులం పరమునకు మనమే వారసులం (2) ప్రేమ పంచిన దేవుని శిష్యులం ఎదురు బెదురూ ఎరుగని వారలం (2) కారు చీకటి కమ్మిన లోకము కాదు మన ప్రభువుకు సమ్మతము ఆత్మలు నశియించుట ఘోరము వారి రక్షణయే మన భారము (2) వెలుగే మనమని సెలవిచ్ఛేనని అప్పగించిన పని జరిగింతుము (2) ||ప్రేమ పంచిన|| వలదు నీ మదిలో సందేహము ప్రభువే పెంచునుగా నీ జ్ఞానము తగిన రీతి తలాంతులు నొసగును నిన్ను అద్భుత పాత్రగా మలచును (2) నీకు భారము మదిలో మెదిలితే ప్రభువే మార్గము చేయును సరళము (2) ||ప్రేమ పంచిన|| నీవు పొందిన సువార్త ఫలము ఇతరులకు పంచుటయే ఘనము సాక్ష్యమును చాటించే ధైర్యము లోకమునకు చూపించును నిజము (2) కోత ఎంతగ ఉంది విరివిగా కోయుదాము ప్రభు పనివారుగా (2) ||ప్రేమ పంచిన|| Yesu Raajyamunaku Sainikulam Paramunaku Maname Vaarasulam (2) Prema Panchina Devuni Shishyulam Eduru Beduru Erugani Vaaralam (2) Kaaru Cheekati Kammina Lokamu Kaadu Mana Prabhuvuku Sammathamu Aathmalu Nashiyinchuta Ghoramu Vaari Rakshanaye Mana Bhaaramu (2) Veluge Manamani Selavichchenani Appaginchina Pani Jariginthumu (2) ||Prema Panchina|| Valadu Nee Madilo Sandehamu Prabhuve Penchunugaa Nee Gnaanamu Thagina Reethi Thalaanthula Nosaganu Ninnu Adbhutha Paathraga Malachunu (2) Neeku Bhaaramu Madilo Medilithe Prabhuve Maargamu Cheyunu Saralamu (2) ||Prema Panchina|| Neevu Pondina Suvaartha Phalamu Itharulaku Panchutayae Ghanamu Saakshyamunu Chaatinche Dhairyamu Lokamunaku Choopinchunu Nijamu (2) Kotha Enthaga Undi Virivigaa Koyudaamu Prabhu Panivaarugaa (2) ||Prema Panchina||