యేసు మనతోనుండగ ధైర్యముగా సాగుచు - YouWorship
Yesu Manathonundaga Dhairyamugaa Saaguchu
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: యేసు మనతోనుండగ ధైర్యముగా సాగుచు - కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము (2) 1. పాత సంగతులన్నియు గతించె మరల రావుగ (2) యేసునందు క్రొత్తవై నూతనముగ నడుపును (2) యేసు ప్రభుని యాజ్ఞలు అద్భుతముగ దొరికెను (2) పరమ దర్శనమందుండి తొలగిపోము యెన్నడు (2) 2. సైతాను శరీరము లోకముతో పోరాడుచు యెంత క్రయమునైనను సంతోషముగ చెల్లింతుము యుద్ధ మందు జయమొంద ప్రభుని శక్తి పొందెదం యేసు జయము పొందుచు సాతాను రాజ్యమణచెదం 3. దుఃఖ రోగ బాధలు కలిగిన చింతించక యేసు నామమందున పొందెదము శక్తిని అల్పకాల యాత్రలో గొణుగు సణుగు లుండక ప్రతి పరిస్థితియందు తృప్తిచెంది యుందుము 4. క్రీస్తు యేసు మనసునే మనము కలిగియుందము ఈర్ష్య క్రోధ విరోధముల్ విడచి ప్రేమ చూపెదం నాగటిమీద చేతిని వుంచి వెనుక తిరుగము యేసు వైపు చూచుచు ఆయనతోడ నడచెదం 5. మనలో పాత పురుషుని చంపెదము సిలువలో అంతరంగ పురుషునందు బలమును పొందెదము ఆత్మీయ జీవితంబులో ఉన్నత స్థానము పొందెదం శరీర యిచ్ఛలన్నియు అణగద్రొక్కి వేసెదం 6. విడచెదం ఈలోకము యాత్ర పూర్తి చేసెదం పరమ రాజ్యమందున పరమ గృహము చేరెదం యేసు ప్రభును సంధించెదం ఆనందముతో నిండెదం బహుమానములు పొందెదం సదా ఆయనతో నుండెదం Pallavi: Yesu Manathonundaga Dhairyamugaa Saaguchu - Kathina Maargamainanu Venukaku Thirugamu (2) 1. Paatha Sanggathulanniyu Gathinche Marala Raavuga (2) Yesunandu Kroththavai Noothanamuga Nadupunu (2) Yesu Prabhuni Yaagnalu Adbhuthamuga Dorikenu (2) Parama Darshanamandundi Tholagipomu Yennadu (2) 2. Saithaanu Shareeramu Lokamutho Poraaduchu Yentha Krayamunainanu Santhoshamuga Chellinthumu Yuddha Mandu Jayamonda Prabhuni Shakthi Pondedan Yesu Jayamu Ponduchu Saathaanu Raajyamanachedan 3. Duhkha Roga Baadhalu Kaligina Chinthinchaka Yesu Naamamanduna Pondedamu Shakthini Alpakaala Yaathralo Gonugu Sanugu Lundaka Prathi Paristhithiyandu Thrupthichendi Yundumu 4. Kreesthu Yesu Manasune Manamu Kaligiyundamu Eershya Krodha Virodhamul Vidachi Prema Choopedan Naagatimeeda Chethini Vunchi Venuka Thirugamu Yesu Vaipu Choochuchu Aayanathoda Nadachedan 5. Manalo Paatha Purushuni Champedamu Siluvalo Antharangga Purushunandu Balamunu Pondedamu Aathmaya Jeevithambulo Unnatha Sthaanamu Pondedan Shareera Yichchhalanniyu Anagadrokki Vesedan 6. Vidachedan Eelokamu Yaathra Poorthi Chesedan Parama Raajyamanduna Parama Gruhamu Cheredan Yesu Prabhunu Sandhinchedan Aanandamutho Nindedan Bahumaanamulu Pondedan Sadaa Aayanatho Nundedang