యేసు ప్రభూ కాపరి నాకు వాసిగా స్తుతించెదన్ - YouWorship
Yesu Prabhoo Kaapari Naaku Vaasigaa Sthuthinchedan
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసు ప్రభూ కాపరి నాకు - వాసిగా స్తుతించెదన్ యేసు గొఱ్ఱెపిల్లను - పోయెదను తన వెంట (2) 1. పచ్చిక పట్లకు - మచ్చికతో నడుపున్ (2) స్వచ్ఛ జలముచెంత - నిచ్చును విశ్రాంతి (2) ముందు ముందు వెళ్లుచు - పొందుగా రక్షించు నన్ను తన మాధుర్య స్వరంబున - తనివి దీర్చును (2) 2. మరణపులోయ ద్వారా - సరిగా నడిపించును అడవి భయములెల్ల - ఎడబాపి రక్షించున్ హత్తి ఒత్తి కట్టి గాయా - లెంతో ఆదరించును వింతగు ఆయన ప్రేమ సేవలో - సంతోషింతును 3. శత్రుల ముందాహారం - సంసిద్ధము జేయును నా గిన్నె నిండించి - పొర్లి పారజేసి కడిగి కడిగి శుద్ధిచేసి - ఆత్మదానమిచ్చెను వడిగా ఆయన సాయమున - జయమున వెళ్ళెదను Pallavi: Yesu Prabhoo Kaapari Naaku - Vaasigaa Sthuthinchedan Yesu Gorrepillanu - Poyedanu Thana Venta (2) 1. Pachchika Patlaku - Machchikatho Nadupun (2) Svachchha Jalamuchentha - Nichchunu Vishraanthi (2) Mundu Mundu Velluchu - Pondugaa Rakshinchu Nannu Thana Maadhurya Svarambuna - Thanivi Deerchunu (2) 2. Maranapuloya Dvaaraa - Sarigaa Nadipinchunu Adavi Bhayamulella - Edabaapi Rakshinchun Haththi Oththi Katti Gaayaa - Lentho Aadarinchunu Vinthagu Aayana Prema Sevalo - Santhoshinthunu 3. Shathrula Mundaahaaran - Sansiddhamu Jeyunu Naa Ginne Nindinchi - Porli Paarajesi Kadigi Kadigi Shuddhichesi - Aathmadaanamichchenu Vadigaa Aayana Saayamuna - Jayamuna Velledanu