యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే - YouWorship
Yesu Prabhu Nee Mukha Darshanamuche
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే (2) - నా ప్రతి యాశను తీర్చుకొందును (2) 1. నీవే నాకు జీవాహారము (2) - నిన్ను సమీపించువారే మాత్రము (2) ఆకలి గొనరిల ఆదర్శుడవు (2) 2. నీ మందిర సమృద్ధి వలన - నా మది నెప్పుడు తృప్తి పొందితిని ఆనంద జలమును త్రాగించుచున్నావు 3. నీవే నాకు జీవపు మార్గము - నీ సన్నిధిని పూర్ణానందము కలదని నిన్ను ఘనపరచెదను 4. ఆశతో నిండిన నా ప్రాణమును - ఆకలిగొనిన నాదు ఆత్మను మేలుతో నీవు తృప్తిపరచితివి 5. నీ సంతోషము నాకొసగితివి - నా సంతోషము పరిపూర్ణముగా కావలయునని కోరిన ప్రభువా 6. నాజీవిత కాలమంతయును - నీ ఆలయములో నివసించుచు హల్లెలూయ పాటను పాడెద ప్రభువా Pallavi: Yesu Prabhu Nee Mukha Darshanamuche (2) - Naa Prathi Yaashanu Theerchukondunu (2) 1. Neeve Naaku Jeevaahaaramu (2) - Ninnu Sameepinchuvaare Maathramu (2) Aakali Gonarila Aadarshudavu (2) 2. Nee Mandira Samruddhi Valana - Naa Madi Neppudu Thrupthi Pondithini Aananda Jalamunu Thraaginchuchunnaavu 3. Neeve Naaku Jeevapu Maargamu - Nee Sannidhini Poornaanandamu Kaladani Ninnu Ghanaparachedanu 4. Aashatho Nindina Naa Praanamunu - Aakaligonina Naadu Aathmanu Melutho Neevu Thrupthiparachithivi 5. Nee Santhoshamu Naakosagithivi - Naa Santhoshamu Paripoornamugaa Kaavalayunani Korina Prabhuvaa 6. Naajeevitha Kaalamanthayunu - Nee Aalayamulo Nivasinchuchu Hallelooya Paatanu Paadeda Prabhuvaa