యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి - YouWorship
Yesu Prabhuni Sangkalpamulu Maaravu Ennatiki
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి (1) మహాప్రభావము ఆయనకే యుగయుగముల వరకు (2) 1. మోషేను ఏర్పరచుకొనె తన ప్రజలను విడిపింప (2) చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో (2) త్రోసినను నడిపించెను వారిని విసుగక తనత్రోవ (2) 2. కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపె ఆవరణము నేర్పరచెను నిండుగ తెరవేసె దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసె 3. మందిరపని అంతయును సంపూర్ణము చేయగనే సుందరముగ నొక మేఘము గుడారమును కమ్మె మందిర మంతయు యెహోవా తేజస్సుతో నిండెన్ 4. నావన్నియును నీవేగదా అమరుడవగు దేవా నీవన్నియును నాకిచ్చితివి నీకృపను బట్టి మహిమ పరతును ఎల్లప్పుడు ఇహపరములయందు 5. పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో నిరతము మహిమ స్తుతిఘనత చెల్లించెద మెపుడు Pallavi: Yesu Prabhuni Sangkalpamulu Maaravu Ennatiki (1) Mahaaprabhaavamu Aayanake Yugayugamula Varaku (2) 1. Moshenu Erparachukone Thana Prajalanu Vidipimpa (2) Chesenugaa Ghana Kaaryamulu Vaari Maargamulo (2) Throsinanu Nadipinchenu Vaarini Visugaka Thanathrova (2) 2. Kondapai Choopina Vidhamunane Mandiramunu Nilipe Aavaranamu Nerparachenu Ninduga Theravese Devuni Kaaryamulanu Moshe Sampoornamu Chese 3. Mandirapani Anthayunu Sampoornamu Cheyagane Sundaramuga Noka Meghamu Gudaaramunu Kamme Mandira Manthayu Yehovaa Thejassutho Ninden 4. Naavanniyunu Neevegadaa Amarudavagu Devaa Neevanniyunu Naakichchithivi NeeKrupanu Batti Mahima Parathunu Ellappudu Ihaparamulayandu 5. Parishuddha Janamaa Paadedamu Kreesthu Prabhuni Batti Parishuddha Devuni Chiththamunu Neraverchuchu Ilalo Nirathamu Mahima Sthuthighanatha Chellincheda Mepudu