యేసు పదాంబుజ శరణం - YouWorship
Yesu Padaambuja Sharanam
Artist: చెట్టి భానుమూర్తి
Category: Worship
Song Lyrics
యేసు పదాంబుజ శరణం - నర - దోష మహాంబుధి - హరణం యేసే మార్గము యేసే సత్యము - యేసే జీవము యేసుకు - శరణం 1. దేవకుమారశరణం - నర - జీవప్రదాత - శరణం దేవదేవ జగదావతారము - బ్రోవరావె ప్రభు నీవే - శరణం 2. పాపవినాశక శరణం - నర శాపవిమోచక - శరణం పావనాత్మ భవదీయ ప్రాణమిడి - ప్రాపువైతివో ప్రభువా - శరణం 3. పరమపురుషుడా శరణం - ఓ - నిరుపమ ప్రేముడ - శరణం మరణ మొంది మరి మృత్యుంజయుడై - పరమున జరిగిన ప్రభువా - శరణం 4. నీతిపూర్ణమా శరణం - జగ - జ్యోతి రతృమా - శరణం జాతిభేదరాహిత్యుడ హితుడా - నీతిప్రబోధక నీవే - శరణం 5. తేజోమూర్తికి శరణం - విభ్రాజిత కీర్తికి - శరణం రాజరాజ యో భారత రాజ్య - ప్రజాత్మ రక్షక ప్రభువా - శరణం Yesu Padaambuja Sharanam - Nara - Dosha Mahaambudhi - Haranam Yese Maargamu Yese Sathyamu - Yese Jeevamu Yesuku - Sharanam 1. Devakumaarasharanam - Nara - Jeevapradaatha - Sharanam Devadeva Jagadaavathaaramu - Brovaraave Prabhu Neeve - Sharanam 2. Paapavinaashaka Sharanam - Nara Shaapavimochaka - Sharanam Paavanaathma Bhavadeeya Praanamidi - Praapuvaithivo Prabhuvaa - Sharanam 3. Paramapurushudaa Sharanam - O - Nirupama Premuda - Sharanam Marana Mondi Mari Mruthyunjayudai - Paramuna Jarigina Prabhuvaa - Sharanam 4. Neethipoornamaa Sharanam - Jaga - Jyothi Rathrumaa - Sharanam Jaathibhedaraahithyuda Hithudaa - Neethiprabodhaka Neeve - Sharanam 5. Thejomoorthiki Sharanam - Vibhraajitha Keerthiki - Sharanam Raajaraaja Yo Bhaaratha Raajya - Prajaathma Rakshaka Prabhuvaa - Sharanam