యేసు నీ నామామృతము - YouWorship
Yesu Nee Naamaamruthamu
Artist: యోనేవు దానియేలు
Category: Praise
Song Lyrics
యేసు నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యా (2) దేవ మా – దోషములను హరించి మోక్షని వాసులుగా జేయుటకు – భాసుర ప్రకాశమైన ||యేసు|| వేడు కలరగ గూడి నిను గొని – యాడు వారికి (2) దేవ యెంతో – కీడు జేసిన పాడు వైరిని గోడుగో డనంగ వాని – తాడనము జేసితివి ||యేసు|| పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యా (2) దేవ నీ – దాపు జేరిన వారి కందరి కాపదలు బాపి నిత్య కాపుగతి జూపినావు ||యేసు|| అక్షయ కరుణేక్ష భువన – రక్షకా నీవే (2) దేవ మమ్ము పక్షముగ రక్షించి మోక్షసు రక్షణకు దీక్ష గొని – వీక్షితులమైన మాకు ||యేసు|| అందమగు నీ మందిరమున – బొందుగా మేము (2) దేవ నీ – సుందర కరుణామృతము మా డెందముల యందు గ్రోలు – టందుకు సుందరమైన ||యేసు|| Yesu Nee Naamaamruthamu Maa – Kentho Ruchi Yayyaa (2) Deva Maa – Doshamulanu Harinchi Mokshani Vaasuluga Jeyutaku – Bhaasura Prakaashamaina ||Yesu|| Vedu Kalaraga goodi Ninu Goni – Yaadu Vaariki (2) Deva Yentho – Keedu Jesina Paadu Vairini Godudo Dananga Vaani – Thaadanamu Jesithivi ||Yesu|| Paapamulu Harimpa Neeve – Praapu Maakayyaa (2) Deva Nee – Daapu Jerina Vaari Kandari Kaapadalu Baapi Nithya Kaapugathi Joopinaavu ||Yesu|| Akshaya Karuneksha Bhuvana – Rakshakaa Neeve (2) Deva Mammu Pakshamuga Rakshinchi Mokshasu Rakshanaku Deeksha Goni – Veekshithulamaina Maaku ||Yesu|| Andamagu Nee Mandiramuna – Bondugaa Memu (2) Deva Nee – Sundara Karunaamruthamu Maa Dendamula Yandu Grolu – Tanduku Sundaramaina ||Yesu||