యేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము విను - YouWorship
Yesu Ninnu Pilachenu Vaasigaa Svaramu Vinu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసు నిన్ను పిలచెను - వాసిగా స్వరము విను (2) 1. కార్చె రక్తము కల్వరిలో - కఠిన బాధలెల్ల నోర్చి (2) చూపె ప్రేమ నుర్వికొఱకు - జాపె బాహువుల్ కరుణతోడ - చేర దీయును (1) 2. క్రీస్తు ప్రేమ తెలిసికొనుము - రయము తోడ మనసు నిల్పి దాని పొడవు వెడల్పు లోతు - నెత్తు గ్రహించు తెలివి తోడ చెంత చేరుము 3. ప్రీతి తోడ యేసు ప్రభువు - ప్రాణము నర్పించె నీకై దీని వలన ప్రేమ యెట్టిదో - తెలిసికొనుము బుద్ధితోడ పాప మొప్పుకో 4. బల్లెముతో పోటుపొడువ - బాధ సహించె ప్రేమ తోడ సమాప్తమని తలను వంచె - సర్వలోక సృష్టికర్త చాటు జేరుము 5. లోకమంత జయించుకొన్న - లోభివలె నశించెదవుగా స్వంత ప్రాణమును కాపాడు - స్వరక్షకుని చెంత జేరి సేద దీర్చుకో Pallavi: Yesu Ninnu Pilachenu - Vaasigaa Svaramu Vinu (2) 1. Kaarche Rakthamu Kalvarilo - Kathina Baadhalella Norchi (2) Choope Prema Nurvikoraku - Jaape Baahuvul Karunathoda - Chera Deeyunu (1) 2. Kreesthu Prema Thelisikonumu - Rayamu Thoda Manasu Nilpi Daani Podavu Vedalpu Lothu - Neththu Grahinchu Thelivi Thoda Chentha Cherumu 3. Preethi Thoda Yesu Prabhuvu - Praanamu Narpinche Neekai Deeni Valana Prema Yettido - Thelisikonumu Buddhithoda Paapa Moppuko 4. Ballemutho Potupoduva - Baadha Sahinche Prema Thoda Samaapthamani Thalanu Vanche - Sarvaloka Srushtikartha Chaatu Jerumu 5. Lokamantha Jayinchukonna - Lobhivale Nashinchedavugaa Svantha Praanamunu Kaapaadu - Svarakshakuni Chentha Jeri Seda Deerchuko