యేసు నాయకుండ - YouWorship
Yesu Naayakunda
Artist: గొల్లపల్లి నతానియేలు
Category: Praise & Worship
Song Lyrics
యేసు నాయకుండ - యెల్ల వేళలను నీ - దాసుల నేలుమయ్యా = మోసము లన్నిటి - మునగద్రోతునని - బాసలు జేసిన - ప్రభుడవు నీవేగా ||యేసు|| 1. రేయింబవలు మా - న్యాయము చెరిపెడి - మాయ పిశాచిని = త్రోయుమి దూరము - బాయక భక్తుల - జేరి విడువని బహుశ్రేష్ఠుడ నీవేగా ||యేసు|| 2. హృదయము లోకము - మది పాపము మమ్ము - సతతము శ్రమ పెట్టును = సదయుండ మమ్మును - వదలక నిత్యము - మది తలపులలో - మహిమగ నేలుమి ||యేసు|| 3. కాపాడుమి మమ్ము - మాపు రేపు నీ - శ్రీ పాదము లొద్దను = ఏ పాపములను ఏలకుండగ నీ - ప్రాపున బెంచుము - మాపాలకుడవో ||యేసు|| 4. మా కొరకై నీ - మేనును క్రానున - మేకులతో గొట్టగ - మానవు మహిమలు - మనుజుల కియ్యను - భానుడ రాజుగ - బ్రతికి లేచితివి ||యేసు|| 5. చెరను చెరనుగా - మరి పట్టుక నీవు - పరమున కరిగితివే - వరముల నిడితివి - ధరలో నరులకు - పరముడ నీ దయ మరువశక్యమా ||యేసు|| Yesu Naayakunda - Yella Velalanu Nee - Daasula Nelumayyaa = Mosamu Lanniti - Munagadrothunani - Baasalu Jesina - Prabhudavu Neevegaa ||Yesu|| 1. Reyimbavalu Maa - Nyaayamu Cheripedi - Maaya Pishaachini = Throyumi Dooramu - Baayaka Bhakthula - Jeri Viduvani Bahushreshthuda Neevegaa ||Yesu|| 2. Hrudayamu Lokamu - Madi Paapamu Mammu - Sathathamu Shrama Pettunu = Sadayunda Mammunu - Vadalaka Nithyamu - Madi Thalapulalo - Mahimaga Nelumi ||Yesu|| 3. Kaapaadumi Mammu - Maapu Repu Nee - Shree Paadamu Loddanu = E Paapamulanu Elakundaga Nee - Praapuna Benchumu - Maapaalakudavo ||Yesu|| 4. Maa Korakai Nee - Menunu Kraanuna - Mekulatho Gottaga - Maanavu Mahimalu - Manujula Kiyyanu - Bhaanuda Raajuga - Brathiki Lechithivi ||Yesu|| 5. Cheranu Cheranugaa - Mari Pattuka Neevu - Paramuna Karigithive - Varamula Nidithivi - Dharalo Narulaku - Paramuda Nee Daya Maruvashakyamaa ||Yesu||