యేసు దేవుని ఆశ్రయించుమా - YouWorship
Yesu Devuni Aashrayinchumaa
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ ఈ క్షణమే విశ్వసించుమా తండ్రిని వేడుమా గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే స్వస్థత లేక… సహాయము లేక… సోలిపోయావా? యేసు నామములోనే స్వస్థత – యేసు కృపలోనే భద్రత యేసు రక్తములోనే విమోచన – యేసే నడిపించును జీవమార్గాన రోగియైన దాసుని కొరకు శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను మాట మాత్రం సెలవిమ్మనగా విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును (2) యేసు నందు విశ్వాసముంచుము (2) ||యేసు నామములోనే|| దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను మొక్కుబడి చేసి ప్రార్థించెను దీవింపబడెను కుమారుని పొందెను నీవు అడుగుము నీకివ్వబడును (2) యేసుని ప్రార్థించుము (2) ||యేసు నామములోనే|| శోధనలనైనా సమస్తమును కోల్పోయిన యోబువంటి విశ్వాసం గమనించుమా యధార్ధతతో నిరీక్షించెను రెండంతల దీవెనలు పొందుకొనెను సహనము చూపుము సమకూడి జరుగును (2) యేసు నందు నిరీక్షించుము (2) ||యేసు నామములోనే|| Yesu Devuni Aashrayinchumaa Sodaraa Sodaree Ee Kshaname Vishwasinchumaa Thandrini Vedumaa Goppa Kaaryaalu Jarugunu Nee Yedute Swasthatha Leka Sahaayamu Leka Solipoyaavaa Yesu Naamamulone Swasthatha – Yesu Krupalone Bhadratha Yesu Rakthamulone Vimochana – Yese Nadipinchunu Jeeva Maargaana Rogiyaina Daasuni Koraku Shathaadhipathi Yesu Prabhuni Vedukonenu Maata Maathram Selavimmanagaa Vishwasinchina Prakaarame Swasthathanu Pondenu Vishwasinchi Adugumu Adbhuthaalu Jarugunu (2) Yesu Nandu Vishwaasamunchumu (2) ||Yesu Naamamulone|| Dukha Sthithilo Hanna Thana Aathmanu Devuni Sannidhini Kummarinchukonenu Mrokkubadi Chesi Praardhinchenu Deevimpabadenu Kumaaruni Pondenu Neevu Adugumu Neekivvabadunu (2) Yesuni Praardhinchumu (2) ||Yesu Naamamulone|| Shodhanalennainaa Samasthamunu Kolpoyinaa Yobu Vanti Vishwaasam Gamaninchumaa Yadaardhathatho Nireekshinchenu Rendanthala Deevenalu Pondukonenu Sahanamu Choopumu Samakoodi Jarugunu (2) Yesu Nandu Nireekshinchumu (2) ||Yesu Naamamulone||