యేసు దేవా నను కొనిపోవా - YouWorship
Yesu Devaa Nanu Konipovaa
Artist: Unknown Artist
Category: Hope
Song Lyrics
యేసు దేవా నను కొనిపోవా నీ రాజ్యముకై వేచియున్నా (2) శాంతి లేని లోకాన – నీ ప్రేమ కరువయ్యింది శాంతి లేని లోకాన – నీ ప్రేమ కనుమరుగయ్యింది నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను అంత వరకు నీదు శక్తినిమ్మయా నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను అంత వరకు నన్ను నీదు సాక్షిగా నిల్పుము ||యేసు|| ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది ఎటు తిరిగినా అన్యాయం ప్రబలి ఉంది (2) నీ ప్రేమతో నను కాచి కాపాడు దేవా నీ రాక వరకు నను నిలబెట్టుము దేవా (2) ||యేసు|| నీ రాజ్యముకై ఈ లోకములో నీ కాడిని మోసెదను నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలో చేర్చెదను (2) నీ ఆత్మ తోడుతో నను బ్రతికించుము నీ ఆత్మ శక్తితో నను బలపరచుము నీ మహిమ రాజ్యమందు నీతో కూడా వసియించుటకు కడ వరకు ఈ భువిలో నమ్మకంగా బ్రతికెదను ||యేసు|| Yesu Devaa Nanu Konipovaa Nee Raajyamukai Vechiyunnaa (2) Shaanthi Leni Lokaana – Nee Prema Karuvayyindi Shaanthi Leni Lokaana – Nee Prema Kanumarugayyindi Nee Raaka Kosame Ne Eduru Choosthunnaanu Antha Varaku Needu Shakthinimmayaa Nee Raaka Kosame Ne Eduru Choosthunnaanu Antha Varaku Nannu Needu Saakshigaa Nilpumu ||Yesu|| Etu Choosinaa Akramame Kanabaduthundi Etu Thiriginaa Anyaayam Prabali Undi (2) Nee Prematho Nanu Kaachi Kaapaadu Devaa Nee Raaka Varaku Nanu Nilabettumu Devaa (2) ||Yesu|| Nee Raajyamukai Ee Lokamulo Nee Kaadini Mosedanu Neevu Preminchina Nee Biddalanu Nee Mandalo Cherchedanu (2) Nee Aathma Thodutho Nanu Brathikinchumu Nee Aathma Shakthitho Nanu Balaparachumu Nee Mahima Raajyamandu Neetho Kooda Vasiyinchutaku Kada Varaku Ee Bhuvilo Nammakamgaa Brathikedanu ||Yesu||