యేసు క్రీస్తు దేవుని శక్తియు - YouWorship
Yesu Kreesthu Devuni Shakthiyu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసు క్రీస్తు దేవుని శక్తియు - జ్ఞానమునైయున్నాడు (2) 1. సిలువ వార్త నశించువారికి - వెర్రితనము-గా నున్నది (2) రక్షింపబడువారికి - అది దేవుని శక్తి (2) నమ్మువారిని రక్షించుట (2) దేవుని దయా - సంకల్పమాయెను (2) 2. మనలా రక్షింప - అనాది నుండి - దేవుని సంకల్పమైయున్నది తన కుమారుని - అర్పించే దేవుడు - ఆయనే మనకు జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచనమాయెను 3. మన విశ్వాసమునకు - దేవుని శక్తిని - ఆధారముగా చేసికొనుడి మానవ జ్ఞానము విడిచిపెట్టుడి - పరిశుద్ధాత్మతో - దేవుని శక్తిని దేవుని పనిలో వినియోగించుడి 4. దేవుడు మనలను - తన సంఘములో - జతపనివారుగాను చేసె పనివాడు కష్టము కొలది - జీతము పొందును మనము దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నాము 5. దేహము దేవుని వలన - అనుగ్రహింపబడి - పరిశుద్ధాత్మకు ఆలయమాయెను మీరు మీ సొత్తుకారు - విలువపెట్టి కొనబడినారు మీ దేహములతో - దేవుని మహిమపర్చి రాకడ కొరకు కనిపెట్టుచుండుడి Pallavi: Yesu Kreesthu Devuni Shakthiyu - Gnaanamunaiyunnaadu (2) 1. Siluva Vaartha Nashinchuvaariki - Verrithanamu-Gaa Nunnadi (2) Rakshimpabaduvaariki - Adi Devuni Shakthi (2) Nammuvaarini Rakshinchuta (2) Devuni Dayaa - Sangkalpamaayenu (2) 2. Manalaa Rakshimpa - Anaadi Nundi - Devuni Sangkalpamaiyunnadi Thana Kumaaruni - Arpinche Devudu - Aayane Manaku Gnaanamu Neethi Parishuddhatha Vimochanamaayenu 3. Mana Vishvaasamunaku - Devuni Shakthini - Aadhaaramugaa Chesikonudi Maanava Gnaanamu Vidichipettudi - Parishuddhathmatho - Devuni Shakthini Devuni Panilo Viniyoginchudi 4. Devudu Manalanu - Thana Sangghamulo - Jathapanivaarugaanu Chese Panivaadu Kashtamu Koladi - Jeethamu Pondunu Manamu Devuni Vyavasaayamunu Devuni Gruhamunai Yunnaamu 5. Dehamu Devuni Valana - Anugrahimpabadi - Parishuddhathmaku Aalayamaayenu Meeru Mee Soththukaaru - Viluvapetti Konabadinaaru Mee Dehamulatho - Devuni Mahimaparchi Raakada Koraku Kanipettuchundudi