యేసు క్రీస్తుండు నిత్య - YouWorship
Yesu Kreesthundu Nithya
Artist: గొల్లపల్లి నతానియేలు
Category: Praise & Worship
Song Lyrics
యేసు క్రీస్తుండు నిత్య దేవుండు - ఇట్టి నమ్ముండి మనుజులారా మోస మొందక మోక్షపతికింక - దాసులై బ్రతుకండి రండి ||యేసు|| 1. ఆరు దినములలోపలనే - యాకాశము భూలోకములను ప్రాకటముగం జేసి నాండు - ప్రకాశుండాయన ప్రజ్ఞవంతుండు ||యేసు|| 2. ఆది పురుషుని యాదిస్త్రీనింక - హస్తములతో నంటి చేసెను మేదినిన్ ఫలవనములోన - సాధులై నివసింప నిచ్చెను ||యేసు|| 3. వారలిద్దరు దేవునాజ్ఞను - కోరికలతో మీరినప్పుడు గారడీ పిశాచ తంత్రము - వారి పరమై పాపులైరి ||యేసు|| 4. వీరలందరు వారి సంతతి - వేరెలేరీ ధరణిలో దుష్మార్గులై దేవుని యాజ్ఞలు - మీరి రందరు నరక పాత్రులు ||యేసు|| 5. ఇంత పాపభరితులై కా - సంతసత్యము లేని నరుల నెంతగాం ప్రేమించెను తన - సొంత ప్రాణము బలిగం బెట్టెను ||యేసు|| 6. పాపమించుకలేని కరుణా - పావనుడు నరుండాయెను శాపగ్రస్తులమైన మన - శాపములు తాంజేతం బూనెను ||యేసు|| 7. ఎన్నరాని బాధలొందుచు - పుణ్యరక్తము జిందెనిలను ఎన్నండు నీలాటి ప్రేమ - వన్నెలేదో యన్నలారా ||యేసు|| 8. మనలం బాపమునుండి బాపను - మనుజుడై మరణంబునొంది మన ప్రభువే మూడవ దినంబున - మహినిలేచి పరము వెళ్లెను ||యేసు|| Yesu Kreesthundu Nithya Devundu - Itti Nammundi Manujulaaraa Mosa Mondaka Mokshapathikinka - Daasulai Brathukandi Randi ||Yesu|| 1. Aaru Dinamulalopalane - Yaakaashamu Bhoolokamulanu Praakatamugam Jesi Naandu - Prakaashundaayana Prajnyavanthundu ||Yesu|| 2. Aadi Purushuni Yaadisthreeninka - Hasthamulatho Nanti Chesenu Medinin Phalavanamulona - Saadhulai Nivasimpa Nichchenu ||Yesu|| 3. Vaaraliddaru Devunaajnyanu - Korikalatho Meerinappudu Gaaradee Pishaacha Thanthramu - Vaari Paramai Paapulairi ||Yesu|| 4. Veeralandaru Vaari Santhathi - Vereleree Dharanilo Dushmaargulai Devuni Yaajnyalu - Meeri Randaru Naraka Paathrulu ||Yesu|| 5. Intha Paapabharithulai Kaa - Santhasathyamu Leni Narula Nenthagaam Preminchenu Thana - Sontha Praanamu Baligam Bettenu ||Yesu|| 6. Paapaminchukaleni Karunaa - Paavanudu Narundaayenu Shaapagrasthulamaina Mana - Shaapamulu Thaanjetham Boonenu ||Yesu|| 7. Ennaraani Baadhalonduchu - Punyarakthamu Jindenilanu Ennandu Neelaati Prema - Vanneledo Yannalaaraa ||Yesu|| 8. Manalam Baapamunundi Baapanu - Manujudai Maranambunondi Mana Prabhuve Moodava Dinambuna - Mahinilechi Paramu Vellenu ||Yesu||