యేసులో హర్షించెదము - YouWorship
Yesulo Harshinchedamu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: యేసులో హర్షించెదము - మహిమలో హర్షింతుము నిరతం (2) మహిమ మహిమ మహిమలో హర్షించెదము (2) 1. పరిశుద్ధులు హర్షింప - యేసు త్వరగా రమ్మని పలుక (1) మారువారికి మకుటం - మనస్సారగ దేవుడిచ్చున్ (1) మహిమ ఘనము మహిమలో నానందింప (2) 2. శుద్ధ జీవులైన - దేవసుతులు ప్రకాశింపన్ సర్వ సృష్టియొక్క - మహా కర్మము లన్నియు తీర రాజుకు మహిమ కలుగు దినములు రాగా 3. దాసులెల్లరుకూడి - దేవుడిచ్చు మకుటము పొంది వేయి సంవత్సరముల్ - రాజ్యమేలుచుండునపుడు నెమలి, కోకిల, గొఱ్ఱె, పులితో వసించున్ 4. చెదల పుడమి నశింప - నవభూమ్యాకాశముల్ కలుగ శాప పాపముల్ సకల - కడురోగము లెల్లను తీర సుఖము, జయముతో నెల్లరు నానందింప 5. బంగారు వీధులను - బహురంగుగా నొప్పుచుండున్ మెరయు వజ్రకాంతుల్ - కూడ నీవు చూచి హర్షింప క్లేశ, కన్నీరులేని నగరులోన 6. స్ఫటిక జీవనదియు - ఇరుప్రక్కల జీవ వృక్షమును ఆకలిదప్పులు లేక - నట జీవ ఫలముల భుజించి తినుచు, త్రాగుచు యేసులో నానందింప 7. పరిశుద్ధాత్మయు సుతుడు - చేసిన రక్షణ కార్యమును తండ్రి దూతల గణముల్ - నట చూచి ప్రహర్షింపన్ క్రొత్త కార్యముకొరకు ఆనందింప Pallavi: Yesulo Harshinchedamu - Mahimalo Harshinthumu Nirathan (2) Mahima Mahima Mahimalo Harshinchedamu (2) 1. Parishuddhalu Harshimpa - Yesu Thvaragaa Rammani Paluka (1) Maaruvaariki Makutan - Manassaaraga Devudichchun (1) Mahima Ghanamu Mahimalo Naanandimpa (2) 2. Shuddha Jeevulaina - Devasuthulu Prakaashimpan Sarva Srushtiyokka - Mahaa Karmamu Lanniyu Theera Raajuku Mahima Kalugu Dinamulu Raagaa 3. Daasulellarukoodi - Devudichchu Makutamu Pondi Veyi Sanvathsaramul - Raajyameluchundunapudu Nemali, Kokila, Gorre, Pulitho Vasinchun 4. Chedala Pudami Nashimpa - Navabhoomyaakaashamul Kaluga Shaapa Paapamul Sakala - Kadurogamu Lellanu Theera Sukhamu, Jayamutho Nellaru Naanandimpa 5. Banggaaru Veedhulanu - Bahuranggugaa Noppuchundun Merayu Vajrakaanthul - Kooda Neevu Choochi Harshimpa Klesha, Kanneeruleni Nagarulona 6. Sphatika Jeevanadiyu - Iruprakkala Jeeva Vrukshamunu Aakalidappulu Leka - Nata Jeeva Phalamula Bhujinchi Thinuchu, Thraaguchu Yesulo Naanandimpa 7. Parishuddhathmayu Suthudu - Chesina Rakshana Kaaryamunu Thandri Doothala Ganamul - Nata Choochi Praharshimpan Kroththa Kaaryamukoraku Aanandimpa