యేసురాజు వచ్చును దూతలతో వచ్చును - YouWorship
Yesuraaju Vachchunu Doothalatho Vachchunu
Artist: సీయోను గీతాలు
Category: Second Coming
Song Lyrics
1. యేసురాజు వచ్చును దూతలతో వచ్చును - దాసుల పరమున జేర్చుటకు (2) యేసుని ముఖజ్యోతిని జూచెదము (2) జయ ధ్వనులచే నుప్పొంగెదము (2) 2. సంఘ వధువు పెండ్లి కుమారుండేసుతో - మంగళ గీతము పాడును నాడు మహిమలో మనము పాడెదము యేసు స్నేహంపు లోతును రుచియింతుము 3. ముద్ర నొంది శుద్ధులు తెల్ల నంగి ధరించి - శుద్ధుని ముంగిట నిలిచెదరు నాడు స్వర్ణ కిరీటమును దాల్చి అందు పాడుచు ప్రకాశించెదము 4. యేసునే ప్రేమించితి - లోక స్నేహం వీడితి - సదా నా యేసుతో ముచ్చటింతున్ ఆహా! భాసిల్లు మహిమతో ముచ్చటింతున్ నాడు ప్రభు యేసునితో సుఖ మొందెదన్ 5. పరలోక బూరధ్వని మ్రోగగానే - పరిశుద్ధులెగిరి వెళ్ళెదరు ఆ సత్యుని కళ్యాణ విందులో -మన మేసుతో నార్భటించెదము 1. Yesuraaju Vachchunu Doothalatho Vachchunu - Daasula Paramuna Jerchutaku (2) Yesuni Mukhajyothini Joochedamu (2) Jaya Dhvanulache Nupponggedamu (2) 2. Sanggha Vadhuvu Pendli Kumaarundesutho - Manggala Geethamu Paadunu Naadu Mahimalo Manamu Paadedamu Yesu Snehampu Lothunu Ruchiyinthumu 3. Mudra Nondi Shuddhulu Thella Nanggi Dharinchi - Shuddhuni Munggita Nilichedaru Naadu Svarna Kireetamunu Daalchi Andu Paaduchu Prakaashinchedamu 4. Yesune Preminchithi - Loka Snehan Veedithi - Sadaa Naa Yesutho Muchchatinthun Aahaa! Bhaasillu Mahimatho Muchchatinthun Naadu Prabhu Yesunitho Sukha Mondedan 5. Paraloka Booradhvani Mrogagaane - Parishuddhalegiri Velledaru Aa Sathyuni Kalyaana Vindulo -Mana Mesutho Naarbhatinchedamu