యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు - YouWorship
Yesuni Sveekarinchu Kreesthesuni Sveekarinchu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసుని స్వీకరించు - క్రీస్తేసుని స్వీకరించు (1) నీ హృదయపు ద్వారము తెరువుము -త్వరితము తానే ప్రవేశించును (2) 1. కనికరమందైశ్వరుండు - నిను - వాత్సల్యముతో విమోచించును (2) భయంకరమైన పాపమునుండి - విడిపింప నిన్ను వెదకివచ్చెన్ (1) 2. మన్నించు సర్వ పాపములన్ - తానే - మాన్పును సర్వరోగములన్ కృప కనికరముల మకుటము నీకు - ధరియింప జేసి ఘనపరచున్ 3. అంధులకు దృష్టి కలుగజేసె - అంగ - హీనులను లేపి నడువజేసెన్ పలు విధములగు వ్యాధి గ్రస్తులకు - స్వస్థత నిచ్చెను తక్షణమే 4. పాపపు భారము భరియించెను - నీ - రోగములన్నిటి తొలగించన్ సహించెను కొరడా దెబ్బల బాధను - జయించెను అన్ని శోధనలన్ 5. కలువరి సిలువలో ప్రేలాడి - తన - రక్తము చిందించె ధారలుగ చేతులలో తన కాళ్ళలో చీలలు - ముండ్ల కిరీటము ధరియించె 6. జీవమిచ్చుటకు ప్రాణమిడె - మరి - జయించెను ప్రతివిధ శోధనలు నీ కొరకై మరణించి లేచెను - శక్తిమంతుడే నిను రక్షింప Pallavi: Yesuni Sveekarinchu - Kreesthesuni Sveekarinchu (1) Nee Hrudayapu Dvaaramu Theruvumu -Thvarithamu Thaane Praveshinchunu (2) 1. Kanikaramandaishvarundu - Ninu - Vaathsalyamutho Vimochinchunu (2) Bhayangkaramaina Paapamunundi - Vidipimpa Ninnu Vedakivachchen (1) 2. Manninchu Sarva Paapamulan - Thaane - Maanpunu Sarvarogamulan Krupa Kanikaramula Makutamu Neeku - Dhariyimpa Jesi Ghanaparachun 3. Andhulaku Drushti Kalugajese - Angga - Heenulanu Lepi Naduvajesen Palu Vidhamulagu Vyaadhi Grasthulaku - Svasthatha Nichchenu Thakshaname 4. Paapapu Bhaaramu Bhariyinchenu - Nee - Rogamulanniti Tholaginchan Sahinchenu Koradaa Debbala Baadhanu - Jayinchenu Anni Shodhanalan 5. Kaluvari Siluvalo Prelaadi - Thana - Rakthamu Chindinche Dhaaraluga Chethulalo Thana Kaallalo Cheelalu - Mundla Kireetamu Dhariyinche 6. Jeevamichchutaku Praanamide - Mari - Jayinchenu Prathividha Shodhanalu Nee Korakai Maraninchi Lechenu - Shakthimanthude Ninu Rakshimpa