యేసుని స్తోత్ర గీతం - YouWorship
Yesuni Sthothra Geetham
Artist: రెవ. జి. రాజరత్నం
Category: Praise & Worship
Song Lyrics
యేసుని స్తోత్ర గీతం కలసి పాడుదమా సంపూర్ణ జీవితమునకు సాగిపోవుదమా సంఘమా ముందుకు సాగుమా జీవిత యాత్రలో దేవుని సేవలో 1. అపోస్తలుల జీవితం హతసాక్షుల అనుభవం కావాలి జీవిత ఆదర్శము కలిగి యుండాలి 25 విశ్వాసము యేసు వైపు చూచుచు సిలువ భారం మోయుచు సాగించు నీ యాత్రిక పయనము||సంఘమా|| 2. ఇంటింట ప్రార్ధన - ప్రతి సంఘారాదన మరచిపోవద్చు ప్రభు సంస్కారము కలసి ధ్యానించు దేవుని వాక్యము అవయవాలు ఎన్నున్నా ఒక్కటే శరీరం సాగించు సమసమాజ జీవనం ||సంఘమా|| 3. కపట సాక్షులు ఎందరో క్రీస్తు దేవుడు కాదని పలుకు తియ్యని తేనె బోధలు నమ్మకు పూర్వనమ్మిక నుండి ఎన్నడు తొలగకు ప్రాథమిక పాఠాలతోనే కాలమంత గడపకు సాగించు ప్రగతి పధమున జీవితం||సంఘమా|| 4. క్రియలు లేని నమ్మిక సాగించకు నీవిక పొరుగు వాని ప్రేమించు నీవలె (తువులను మన్నించు ప్రభువలె అవసరములో ఉన్నవాని ఆదుకొనేటే న్యాయము సాగించు ఈ ధర్మ కార్యము 5. ప్రభుని వార్త ప్రకటన ప్రజల కొరకై నివేదన నీ ధ్యేయం కావాలి సంఘమా ఈ భారం నీదే గమనించుమా త్రియేక దైవం అందించు సాయం సాగించే ప్రభుని వార్త మహోద్యమం|| సంఘమా|| Yesuni Sthothra Geethan Kalasi Paadudamaa Sampoorna Jeevithamunaku Saagipovudamaa Sangghamaa Munduku Saagumaa Jeevitha Yaathralo Devuni Sevalo 1. Aposthalula Jeevithan Hathasaakshula Anubhavan Kaavaali Jeevitha Aadarshamu Kaligi Yundaali 25 Vishvaasamu Yesu Vaipu Choochuchu Siluva Bhaaran Moyuchu Saaginchu Nee Yaathrika Payanamu||Sangghamaa|| 2. Intinta Praardhana - Prathi Sangghaaraadana Marachipovadchu Prabhu Sanskaaramu Kalasi Dhyaaninchu Devuni Vaakyamu Avayavaalu Ennunnaa Okkate Shareeran Saaginchu Samasamaaja Jeevanan ||Sangghamaa|| 3. Kapata Saakshulu Endaro Kreesthu Devudu Kaadani Paluku Thiyyani Thene Bodhalu Nammaku Poorvanammika Nundi Ennadu Tholagaku Praathamika Paathaalathone Kaalamantha Gadapaku Saaginchu Pragathi Padhamuna Jeevithan||Sangghamaa|| 4. Kriyalu Leni Nammika Saaginchaku Neevika Porugu Vaani Preminchu Neevale (Thuvulanu Manninchu Prabhuvale Avasaramulo Unnavaani Aadukonete Nyaayamu Saaginchu Ee Dharma Kaaryamu 5. Prabhuni Vaartha Prakatana Prajala Korakai Nivedana Nee Dhyeyan Kaavaali Sangghamaa Ee Bhaaran Neede Gamaninchumaa Thriyeka Daivan Andinchu Saayan Saaginche Prabhuni Vaartha Mahodyaman|| Sangghamaa||