యేసుని వెంట నేను వెంబడించుచున్నాను - YouWorship
Yesuni Venta Nenu Vembadinchuchunnaanu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: యేసుని వెంట నేను - వెంబడించుచున్నాను నా సిలువను మోయుచు నేను - వెంబడించుచున్నాను అను పల్లవి: తన హృదయానుసారునిగా - ఉండుటకు సిద్ధపడుచున్నాను || యేసుని || 1. ఎంతో అద్భుతమైనది - నా ప్రభుని బలియాగం (2) సాదృశ్యముగ నా కొరకై (1) - ప్రాణమర్పించెను (2) నా ప్రభుని తలచుచు నేను - వెంబడించుచున్నాను (2) 2. ఈ లోక సౌందర్యము - నన్ను మోసగించదు సాతాను యుక్తులన్నియు - నా మీద పనిచేయవు యేసుని స్వరము వినుచు - వెంబడించుచున్నాను 3. ఎంతో అద్భుతమైనది - నా ప్రభు నన్ను శిక్షించుట ప్రభు నన్ను సరిచేయుట - తన ప్రేమయై యున్నది యేసుని స్వరము వినుచు - వెంబడించుచున్నాను 4. ఇబ్బందులెన్నో కలిగిన నా దృష్టి ప్రభు మీదనే శ్రమలే మాత్రము కదల్చవు - అద్దరి అగుపడుచున్నది శీఘ్రముగానే చేరుటకు - వెంబడించుచున్నాను 5. తన చిత్తములో నన్నుంచి - నా ప్రభు సంతోషించును మంచి మాటలన్నియు నేర్పి - నను సిద్ధపరచుచున్నాడు మహిమను పొందుటకు నేను - వెంబడించుచున్నాను Pallavi: Yesuni Venta Nenu - Vembadinchuchunnaanu Naa Siluvanu Moyuchu Nenu - Vembadinchuchunnaanu Anu Pallavi: Thana Hrudayaanusaarunigaa - Undutaku Siddhapaduchunnaanu || Yesuni || 1. Entho Adbhuthamainadi - Naa Prabhuni Baliyaagan (2) Saadrushyamuga Naa Korakai (1) - Praanamarpinchenu (2) Naa Prabhuni Thalachuchu Nenu - Vembadinchuchunnaanu (2) 2. Ee Loka Saundaryamu - Nannu Mosaginchadu Saathaanu Yukthulanniyu - Naa Meeda Panicheyavu Yesuni Svaramu Vinuchu - Vembadinchuchunnaanu 3. Entho Adbhuthamainadi - Naa Prabhu Nannu Shikshinchuta Prabhu Nannu Saricheyuta - Thana Premayai Yunnadi Yesuni Svaramu Vinuchu - Vembadinchuchunnaanu 4. Ibbandulenno Kaligina Naa Drushti Prabhu Meedane Shramale Maathramu Kadalchavu - Addari Agupaduchunnadi Sheeghramugaane Cherutaku - Vembadinchuchunnaanu 5. Thana Chiththamulo Nannunchi - Naa Prabhu Santhoshinchunu Manchi Maatalanniyu Nerpi - Nanu Siddhaparachuchunnaadu Mahimanu Pondutaku Nenu - Vembadinchuchunnaanu