యేసుని భజియింపవే మనసా - YouWorship
Yesuni Bhajiyimpave Manasaa
Artist: రావూరి లక్ష్మయ్య
Category: Worship
Song Lyrics
యేసుని భజియింపవే మనసా - నీ దోసములు చనం - జేసి కృపతోం బ్రోచునే మనసా వాసి కెక్కిన క్రీస్తు మోక్షని - వాసిగా కింక వేరేలేరని దోసిలొగ్గి నుతించితే నిను - ట్రోసివేయండు దోసకారని ||యేసు|| 1. ఏటికే నీ కీదురాశలు - నీ - కెప్పుడును చెవి - నాటవుగ ప్రభు యేసు వాక్యములు వాటముగ నా తుది దినమున - నీటుమోరంగ నిత్యజీవ కిరీటమును నీకిత్తు నని తన నోటం బల్మిన మాట దప్పండు ||యేసు|| 2. ఖండనగ నిను చెండియాడండు - యెల్లప్పుడుందన మిత్రుడని రక్షించు నతండితండు అండంబాయక నిన్ను ప్రతి దిన - గండములను హరించునని నీ వుండ గోరిన నిండు నెమ్మది - దండిగ నీకుండం జెప్పును ||యేసు|| 3. లోక సైతాను దుర్భోధలు - నీ వాలింపక యా - లోకరక్షకుని సుబోధలు ఏక మనసుతో రాత్రింబగలు పరాకులేకను గాచు నా ప్రభు రాకడను నీవెజింగినను పరలోకశుభ సుఖసౌఖ్య మొసంగును ||యేసు|| 4. వంచనలు మది నుంచకే మనసా - నీ దుర్గుణము తల ద్రుంచి ప్రభుని సేవింపవే మనసా అంచితముగా క్రీస్తు డీప్రపంచ జనుల భవాబ్ధీనావగ నెంచి నీ భవభార మతనిపై నుంచి సతము ప్రార్థించు మనసా ||యేసు|| 5. నిన్ను పాప బంధముల నుండి - రక్షించుటకు సర్వోన్నతుని కుమారుడై వెలసి ఎన్నంగ నీవొందు దుఃఖములన్నిటిని తా ననుభవించెను విన్న తక్షణ మేసుక్రీస్తుని - విశ్వసించి సుఖించు మనసా ||యేసు|| Yesuni Bhajiyimpave Manasaa - Nee Dosamulu Chanam - Jesi Krupathom Brochune Manasaa Vaasi Kekkina Kreesthu Mokshani - Vaasigaa Kinka Verelerani Dosiloggi Nuthinchithe Ninu - Trosiveyandu Dosakaarani ||Yesu|| 1. Etike Nee Keeduraashalu - Nee - Keppudunu Chevi - Naatavuga Prabhu Yesu Vaakyamulu Vaatamuga Naa Thudi Dinamuna - Neetumoranga Nithyajeeva Kireetamunu Neekiththu Nani Thana Notam Balmina Maata Dappandu ||Yesu|| 2. Khandanaga Ninu Chendiyaadandu - Yellappudundana Mithrudani Rakshinchu Nathandithandu Andambaayaka Ninnu Prathi Dina - Gandamulanu Harinchunani Nee Vunda Gorina Nindu Nemmadi - Dandiga Neekundam Jeppunu ||Yesu|| 3. Loka Saithaanu Durbhodhalu - Nee Vaalimpaka Yaa - Lokarakshakuni Subodhalu Eka Manasutho Raathrimbagalu Paraakulekanu Gaachu Naa Prabhu Raakadanu Neevejinginanu Paralokashubha Sukhasaukhya Mosangunu ||Yesu|| 4. Vanchanalu Madi Nunchake Manasaa - Nee Durgunamu Thala Drunchi Prabhuni Sevimpave Manasaa Anchithamugaa Kreesthu Deeprapancha Janula Bhavaabdheenaavaga Nenchi Nee Bhavabhaara Mathanipai Nunchi Sathamu Praarthinchu Manasaa ||Yesu|| 5. Ninnu Paapa Bandhamula Nundi - Rakshinchutaku Sarvonnathuni Kumaarudai Velasi Ennanga Neevondu Duhkhamulannitini Thaa Nanubhavinchenu Vinna Thakshana Mesukreesthuni - Vishvasinchi Sukhinchu Manasaa ||Yesu||