యేసుని నిత్యము స్తుతియించెదము - YouWorship
Yesuni Nithyamu Sthuthiyinchedamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసు మారడు - యేసు మారడు - విశ్వమంత మారినను - మాటతప్పడు (2) 1. యేసుని నిత్యము స్తుతియించెదము - భూమి ఆకాశము సృజించినాడు (2) మనలో దేవుని సంకల్పము - యేసుని బయలు పరచుటయే (2) 2. ఎందరిని ప్రభు ముందు ఎరిగెనో - అందరిని ప్రభు నిర్ణయించెను పొందుగ పిలిచి నీతిగా తీర్చె - సుందరముగా మహిమపర్చు || యేసు || 3. చేసెను మనలను తన రూపమున - బాసెను పాపముచే నా రూపం యేసులో నొసగె మరల మనకు - వాసిగ కాచును పుత్రులుగా || యేసు || 4. దేవుని ప్రేమించువారందరికి - భువిలో జరుగునన్ని మేలుకై కావవి ఎన్నదగిన శ్రమలు - భావి మహిమతో పోల్చుటకై || యేసు || 5. శ్రమయు బాధ హింసయైనను - కరువు వస్త్రహీనతయును ఉపద్రవమైనను ఖడ్గమైనను - ఎడబాపునే ప్రభు ప్రేమనుండి || యేసు || 6. మరణము జీవమైనను - దేవదూతలు ప్రధానులు అధికారులు మరి ఎవరైనను - ఎడబాపరు ప్రభు ప్రేమనుండి || యేసు || 7. ఆనాది దేవుని ఆ సంకల్పం - మనలో ప్రభుని బయలుపరప మనవలెను మనపాపములు - పూనికతో పూర్ణ ఐక్యతకు || యేసు || Pallavi: Yesu Maaradu - Yesu Maaradu - Vishvamantha Maarinanu - Maatathappadu (2) 1. Yesuni Nithyamu Sthuthiyinchedamu - Bhoomi Aakaashamu Srujinchinaadu (2) Manalo Devuni Sangkalpamu - Yesuni Bayalu Parachutaye (2) 2. Endarini Prabhu Mundu Erigeno - Andarini Prabhu Nirnayinchenu Ponduga Pilichi Neethigaa Theerche - Sundaramugaa Mahimaparchu || Yesu || 3. Chesenu Manalanu Thana Roopamuna - Baasenu Paapamuche Naa Roopan Yesulo Nosage Marala Manaku - Vaasiga Kaachunu Puthrulugaa || Yesu || 4. Devuni Preminchuvaarandariki - Bhuvilo Jarugunanni Melukai Kaavavi Ennadagina Shramalu - Bhaavi Mahimatho Polchutakai || Yesu || 5. Shramayu Baadha Hinsayainanu - Karuvu Vasthraheenathayunu Upadravamainanu Khadgamainanu - Edabaapune Prabhu Premanundi || Yesu || 6. Maranamu Jeevamainanu - Devadoothalu Pradhaanulu Adhikaarulu Mari Evarainanu - Edabaaparu Prabhu Premanundi || Yesu || 7. Aanaadi Devuni Aa Sangkalpan - Manalo Prabhuni Bayaluparapa Manavalenu Manapaapamulu - Poonikatho Poorna Aikyathaku || Yesu ||