యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో - YouWorship
Yesuni Nammedivaaru Aayana Uchitha Krupatho
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో (1) నీతిమంతులయ్యెదరు - యేసుని నమ్మెడివారు (1) 1. ఖర్జూరపు చెట్టువలె - మొవ్వు వేయుచుండెదరు (2) ఖర్జూరపు మట్టలతో - రక్షణకై స్తుతించెదరు (2) 2. లేబానోను దేవదారు - చెట్టువలె ఎదుగుదురు ప్రభు కృపాజ్ఞానములో - ఎదుగుచు నుందురువారు 3. యెహోవా మందిరములో - నాటబడి యుండెదరు సహనముతో నిలిచెదరు - కదలక స్థిరులై యుండెదరు 4. దేవుని యావరణములో - వర్ధిల్లుచు నుండెదరు సేవింతురు తమ ప్రభుని - ఘనపరతురు నిరతంబు 5. వారు ముసలితనంబున - చిగురు పెట్టి ఫలింతురు ప్రసిద్ధి చేతురు ప్రభుని - యథార్థవంతుడనుచు 6. నీటి కాలువ యోరను - నాటబడిన వారలై మేటిసారము కలిగి - పచ్చగ నుందురు వారు 7. హల్లేలూయ పాటపాడి - వల్లభుని స్తుతింతురు చల్లని ప్రభురాకడకై - మెల్లగా వేచియుండెదరు Pallavi: Yesuni Nammedivaaru Aayana Uchitha Krupatho (1) Neethimanthulayyedaru - Yesuni Nammedivaaru (1) 1. Kharjoorapu Chettuvale - Movvu Veyuchundedaru (2) Kharjoorapu Mattalatho - Rakshanakai Sthuthinchedaru (2) 2. Lebaanonu Devadaaru - Chettuvale Eduguduru Prabhu Krupagnaanamulo - Eduguchu Nunduruvaaru 3. Yehovaa Mandiramulo - Naatabadi Yundedaru Sahanamutho Nilichedaru - Kadalaka Sthirulai Yundedaru 4. Devuni Yaavaranamulo - Vardhilluchu Nundedaru Sevinthuru Thama Prabhuni - Ghanaparathuru Nirathambu 5. Vaaru Musalithanambuna - Chiguru Petti Phalinthuru Prasiddhi Chethuru Prabhuni - Yathaarthavanthudanuchu 6. Neeti Kaaluva Yoranu - Naatabadina Vaaralai Metisaaramu Kaligi - Pachchaga Nunduru Vaaru 7. Hallelooya Paatapaadi - Vallabhuni Sthuthinthuru Challani Prabhuraakadakai - Mellagaa Vechiyundedaru