యేసునాథుని గాయములను చూడుము - YouWorship
Yesunaathuni Gaayamulanu Choodumu
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: చూచి జీవించు యేసునాథుని గాయములను చూడుము నిత్యజీవము పొందెదవు 1. యేసునాథుని గాయములను చూడుము - నిత్యజీవము పొందెదవు ప్రాణమిచ్చి విమోచించిన వానిని - నమ్మివచ్చి చేరి చూడుము 2. పాపభారము మోసిన రక్షకునిచే - నీ నేరము తొలగెన్ జీవనాథుడు కార్చిన రక్తముచే - నీ పాప ఋణము తీరెన్ || చూచి || 3. ఏ క్రియలు ప్రార్థన కన్నీళ్ళును - నిన్ను రక్షింపజాలవు రక్తంబే ఆశ్రయమని వచ్చిన - కరుణించు విమోచకుడు || చూచి || 4. పాప ప్రాయశ్చిత్త క్రియలు ముగిసె - అని ప్రభువే పల్కెను సర్వలోకపు నేర పాపమున్ - సిలువలో నివృత్తి జేసెన్ || చూచి || 5. పాపనాశకుడు ఇచ్చు రక్షణను - ఈ క్షణమే పట్టుకొనుము నీ నీతియగు యేసు పుణ్యముచే - మోక్షానందముల పొందెదవు || చూచి || Pallavi: Choochi Jeevinchu Yesunaathuni Gaayamulanu Choodumu Nithyajeevamu Pondedavu 1. Yesunaathuni Gaayamulanu Choodumu - Nithyajeevamu Pondedavu Praanamichchi Vimochinchina Vaanini - Nammivachchi Cheri Choodumu 2. Paapabhaaramu Mosina Rakshakuniche - Nee Neramu Tholagen Jeevanaathudu Kaarchina Rakthamuche - Nee Paapa Runamu Theeren || Choochi || 3. E Kriyalu Praarthana Kanneellunu - Ninnu Rakshimpajaalavu Rakthambe Aashrayamani Vachchina - Karuninchu Vimochakudu || Choochi || 4. Paapa Praayashchiththa Kriyalu Mugise - Ani Prabhuve Palkenu Sarvalokapu Nera Paapamun - Siluvalo Nivruththi Jesen || Choochi || 5. Paapanaashakudu Ichchu Rakshananu - Ee Kshaname Pattukonumu Nee Neethiyagu Yesu Punyamuche - Mokshaanandamula Pondedavu || Choochi ||