యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగనే యున్నాడు - YouWorship
YesuKreesthu Ninna Nedu Ekareethigane Yunnaadu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగనే యున్నాడు (1) యుగయుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును (2) 1. అన్నిటికంటె ముందుగ నున్న (2)- అల్ఫాగ తానై యుండి (2) తనయందు మనల పూర్ణులజేసె (2)- ఓమెగ తానైయుండి (2) 2. లోకము పుట్టక మునుపే తాను - మహిమలో తండ్రితో నుండె ప్రేమను పొందిన తానే మనకై - శాశ్వత ప్రేమను జూపె 3. అనేకులైన కుమారులను - మహిమకు తెచ్చుటకై రక్షణ కర్తను శ్రమల ద్వారా - సంపూర్ణుని జేసె తండ్రి 4. జగదుత్పత్తి మొదలుకొని - వధియింప బడియున్న దేవుని గొర్రెపిల్లగ తానై - పరమందారాధన నొందు 5. నిత్యము నిలచు తన నామంబు - నూతన సృష్టియందు తన సేవకుల సంతతి తనతో - తరతరముల వరకుండున్ 6. అధికంబైన కృప మహిమన్ - యుగయుగములయందు జూపన్ మనలను లేపి కూర్చుండబెట్టె - క్రీస్తుతో మన తండ్రి 7. ఇట్టి మహిమన్ పొందుటకై - మనమంత తనతో గూడ శిబిరము వెలుపట నిందల నోర్చి - వెళ్ళుద మాయనతో Pallavi: YesuKreesthu Ninna Nedu Ekareethigane Yunnaadu (1) Yugayugamula Varaku Thaane Okkate Reethigaa Nundunu (2) 1. Annitikante Munduga Nunna (2)- Alphaaga Thaanai Yundi (2) Thanayandu Manala Poornulajese (2)- Omega Thaanaiyundi (2) 2. Lokamu Puttaka Munupe Thaanu - Mahimalo Thandritho Nunde Premanu Pondina Thaane Manakai - Shaashvatha Premanu Joope 3. Anekulaina Kumaarulanu - Mahimaku Thechchutakai Rakshana Karthanu Shramala Dvaaraa - Sampoornuni Jese Thandri 4. Jagaduthpaththi Modalukoni - Vadhiyimpa Badiyunna Devuni Gorrepillaga Thaanai - Paramandaaraadhana Nondu 5. Nithyamu Nilachu Thana Naamambu - Noothana Srushtiyandu Thana Sevakula Santhathi Thanatho - Tharatharamula Varakundun 6. Adhikambaina Krupa Mahiman - Yugayugamulayandu Joopan Manalanu Lepi Koorchundabette - Kreesthutho Mana Thandri 7. Itti Mahiman Pondutakai - Manamantha Thanatho Gooda Shibiramu Velupata Nindala Norchi - Velluda Maayanatho