యేసయ్య నీ ప్రేమ - YouWorship
Yesayya Nee Prema
Artist: జాషువా షేక్
Category: Praise
Song Lyrics
యేసయ్య నీ ప్రేమ నా సొంతము – నాలోన పలికిన స్తుతిగీతము యేసయ్య నీవేగా తొలికిరణము – నాలోన వెలిగిన రవికిరణము ఏనాడు ఆరని నా దీపము – నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము – నాలోన నిత్యము ఒక సంబరం ||యేసయ్య|| ఏపాటి నన్ను ప్రేమించినావు – నీ ప్రేమలోనే నను దాచినావు నా భారమంతా నువు మోసినావు – నన్నెంతగానో హెచ్చించినావు నీ కృపలోనే నను కాచినావు – నీ కనికరమే చూపించినావు నా హృదిలోనే నీ వాక్యధ్యానం – నా మదిలోనే నీ నామస్మరణం నిన్నే ఆరాధించి – నీ దయలో నే జీవించి నిన్నే నే పూజించి – నీలో నే తరియించీ ||యేసయ్య|| ఏనాడు నన్ను విడనాడలేదు – నీ నీడలోనే నడిపించినావు లోకాలనేలే రారాజు నీవే – నా జీవనావకు రహదారి నీవే నా గురి నీవే నా యేసుదేవా – చేరితి నిన్నే నా ప్రాణనాథా పర్వత శిఖరం నీ మహిమ ద్వారం – ఉన్నతమైనది నీ దివ్య చరితం సాటే లేరు నీకు – సర్వాధికారివి నీవు మారని దైవం నీవు – మహిమోన్నతుడవు నీవు ||యేసయ్య|| Yesayya Nee Prema Naa Sonthamu – Naalona Palikina Sthuthi Geethamu Yesayya Neevegaa Tholi Kiranamu – Naalona Veligina Ravi Kiranamu Aenaadu Aarani Naa Deepamu – Naa Jeevithaaniki Aadhaaramu Immaanuyelugaa Nee Snehamu – Naalona Nithyamu Oka Sambaram ||Yesayya|| Aepaati Nannu Preminchinaavu – Nee Premalone Nanu Daachinaavu Naa Bhaaramanthaa Nuvu Mosinaavu – Nannenthagaano Hechchinchinaavu Nee Krupalone Nanu Kaachinaavu – Nee Kanikarame Choopinchinaavu Naa Hrudilone Nee Vaakya Dhyaanam – Naa Madilone Nee Naama Smaranam Ninne Aaraadhinchi – Nee Dayalo Ne Jeevinchi Ninne Ne Poojinchi – Neelone Thariyinchi ||Yesayya|| Aenaadu Nannu Vidanaadaledu – Nee Needalone Nadipinchinaavu Lokaalanele Raaraaju Neeve – Naa Jeeva Naavaku Rahadaari Neeve Naa Guri Neeve Naa Yesu Devaa – Cherithi Ninne Naa Praana Naathaa Parvatha Shikharam Nee Mahima Dwaaram – Unnathamainadi Nee Divya Charitham Saate Leru Neeku – Sarvaadhikaarivi Neevu Maarani Daivam Neevu – Mahimonnathudavu Neevu ||Yesayya||