యేసయ్యా నిన్ను ప్రేమించువారు - YouWorship
Yesayyaa Ninnu Preminchuvaaru
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెనె ఉదయించెదరు నిత్యము (2) శాశ్వత కాలం నీతోనే నివసింతురు (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారు సకలమైన ఉపద్రవముల నుండి (2) నిర్దోషులై కాపాడబడెదరు అపవాది అగ్ని బాణముల నుండి (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారు దేవ దూతల జ్ఞానమును కలిగుందురు (2) సమకూడి జరుగును సమస్తము సదా మాతో ఉన్నందున (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారిని ఎవ్వరునూ ద్వేషించి జయమొందలేరు (2) మా ప్రక్క నిలిచి సింహాల నోటి నుండి తప్పించి బలపరచినావు (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారి చేతులకు వారి శత్రువుల నప్పగింతువు (2) వారి కాలమంతట దేశమంతయు నెమ్మదిగా నుండును (2) ||యేసయ్య|| Yesayyaa Ninnu Preminchuvaaru Balamaina Sooryuni Valene Udayinchedaru Nithyamu (2) Shaashwatha Kaalam Neethone Nivasinthuru (2) ||Yesayyaa|| Ninnu Preminchuvaaru Sakalamaina Upadravamula Nundi (2) Nirdoshulai Kaapaadabadedaru Apavaadi Agni Baanamula Nundi (2) ||Yesayyaa|| Ninnu Preminchuvaaru Deva Doothala Gnaanamunu Kaligunduru (2) Samakoodi Jarugunu Samasthamu Sadaa Maatho Unnanduna(2) ||Yesayyaa|| Ninnu Preminchuvaarini Evvarunu Dweshinchi Jayamondaleru (2) Maa Prakka Nilichi Simhaala Noti Nundi Thappinchi Balaparachinaavu(2) ||Yesayyaa|| Ninnu Preminchuvaari Chethulaku Vaari Shathruvula Nappaginthuvu (2) Vaari Kaalamanthata Deshamanthayu Nemmadigaa Nundunu (2) ||Yesayyaa||