యేసయ్యా కనికరపూర్ణుడా - YouWorship
Yesayyaa Kanikarapoornudaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా (2) నీవే నా సంతోష గానము సర్వ సంపదలకు ఆధారము (2) ||యేసయ్యా|| నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి (2) సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే (2) ||యేసయ్యా|| నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి (2) అలసిన వారి ఆశను తృప్తిపరచితివి అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము (2) ||యేసయ్యా|| నీ వలన బలమునొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు (2) నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు (2) ||యేసయ్యా|| ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు (4) ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు (4) Yesayyaa Kanikarapoornudaa Manohara Premaku Nilayudaa (2) Neeve Naa Santhosha Gaanamu Sarva Sampadalaku Aadhaaramu (2) ||Yesayyaa|| Naa Valana Ediyu Aashinchakaye Preminchithivi Nanu Rakshinchutaku Unnatha Bhaagyamu Vidachithivi (2) Siluva Mraanupai Rakthamu Kaarchi Rakshinchithivi Shaashwatha Krupa Pondi Jeevinthunu Ila Nee Korake (2) ||Yesayyaa|| Naa Koraku Sarvamu Dhaaraalamugaa Dayacheyuvaadavu Daahamu Theerchutaku Bandanu Cheelchina Upakaarivi (2) Alasina Vaari Aashanu Thrupthiparachithivi Anantha Krupapondi Aaradhinthunu Anukshanamu (2) ||Yesayyaa|| Nee Valana Balamunondina Vaare Dhanyulu Nee Sannidhi Aina Seeyonulo Vaaru Nilichedaru (2) Niluvaramaina Raajyamulo Ninu Choochutaku Nithyamu Krupapondi Sevinchedanu Thudivaraku (2) ||Yesayyaa|| Aaradhanaku Yogyudavu Ellavelala Poojyudavu (4) Ellavelalaa Poojyudavu Aaradhanaku Yogyudavu (4)