యెహోవా సేవకులారా స్తుతించుడి - YouWorship
Yehovaa Sevakulaaraa Sthuthinchudi
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: యెహోవా సేవకులారా స్తుతించుడి - ఆయన నామమును స్తుతించుడి (1) అను పల్లవి: యెహోవా మందిర ఆవరణములలో (2) నిలుచుండు వారలారా మీరు (1) 1. యెహోవా దయాళుడు ఆయన నామమును - కీర్తించుడి అది మనోహరము (1) యాకోబును తనకొర కేర్పరచుకొని (2) ఇశ్రాయేలును స్వకీయ ధనముగా కొనెన్ (1) 2. యెహోవా సకల దేవతల కంటెను - గొప్పవాడని నేనెరుంగుదున్ భూమ్యాకాశములు మహా సముద్రము - లందాయన కిష్టమైనవి చేసెను 3. భూమి దిగంతముల నుండి ఆవిరి - లేవజేసి వాన కురియునట్లు మెరుపును పుట్టించి తన నిధులలో నుండి గాలిని బయలు వెళ్ళఁజేయు వాడాయనే 4. ఐగుప్తు జనుల తొలిచూలులను - పశువుల తొలిచూలుల జంపెను ఫరో యెదుట వాని ఉద్యోగుల యెదుట సూచనల మహాత్కార్యముల జేసె 5. అన్యులనేకులను శక్తిగల - రాజులనేకులను చంపెను అమోరీయుల రాజైన సీహోనును బాషాను రాజగు ఓగును చంపెను 6. కనాను రాజ్యముల పాడుచేసియు - నిశ్రాయేలేయుల కప్పగించెను యెహోవా నీ నామము నిత్యముండున్ నీ జ్ఞాపకార్థము తర తరములకును 7. యెహోవా తనదగు ప్రజలకు తానే - న్యాయము తీర్చును హల్లెలూయ తన వారగు తన సేవకులను బట్టి సంతాపము నొందు నాయనల్లేలూయ Pallavi: Yehovaa Sevakulaaraa Sthuthinchudi - Aayana Naamamunu Sthuthinchudi (1) Anu Pallavi: Yehovaa Mandira Aavaranamulalo (2) Niluchundu Vaaralaaraa Meeru (1) 1. Yehovaa Dayaaludu Aayana Naamamunu - Keerthinchudi Adi Manoharamu (1) Yaakobunu Thanakora Kerparachukoni (2) Ishraayelunu Svakeeya Dhanamugaa Konen (1) 2. Yehovaa Sakala Devathala Kantenu - Goppavaadani Nenerunggudun Bhoomyaakaashamulu Mahaa Samudramu - Landaayana Kishtamainavi Chesenu 3. Bhoomi Diganthamula Nundi Aaviri - Levajesi Vaana Kuriyunatlu Merupunu Puttinchi Thana Nidhulalo Nundi Gaalini Bayalu Vellanjeyu Vaadaayane 4. Aigupthu Janula Tholichoolulanu - Pashuvula Tholichoolula Jampenu Pharo Yeduta Vaani Udyogula Yeduta Soochanala Mahaathkaaryamula Jese 5. Anyulanekulanu Shakthigala - Raajulanekulanu Champenu Amoreeyula Raajaina Seehonunu Baashaanu Raajagu Ogunu Champenu 6. Kanaanu Raajyamula Paaduchesiyu - Nishraayeleyula Kappaginchenu Yehovaa Nee Naamamu Nithyamundun Nee Gnaapakaarthamu Thara Tharamulakunu 7. Yehovaa Thanadagu Prajalaku Thaane - Nyaayamu Theerchunu Hallelooya Thana Vaaragu Thana Sevakulanu Batti Santhaapamu Nondu Naayanallelooya