యెహోవా విమోచించిన వారె - YouWorship
Yehovaa Vimochinchina Vaare
Artist: సీయోను గీతాలు
Category: Hope
Song Lyrics
పల్లవి: యెహోవా విమోచించిన వారె - పాటలు పాడుచు సీయోనునకు తిరిగి వత్తురు - నిత్యానందము కలిగిన వారై 1. ప్రభువైన యసు భూలోకమున - మహారాజై ఏలగ రాగ నిత్యానందముతో విజయసూచనతో - మనస్సున దుఃఖము నిట్టూర్పును లేక 2. అరణ్యమును ఎండిన భూమియు - విరియబూయు నుల్లాసముతో ఘనడై యెహోవా మహిమను గాంచు - ప్రభుక్రీస్తుని ప్రభావమును 3. గ్రుడ్డికి కన్నులు చెవిటికి చెవులు - కుంటిని గెంతెడి దుప్పిగా జేయ సుందరుడైన రాజున్ డెందమున గాంచి - మూగవాని నాలుక పాడి హర్షింప 4. పయనింతురు వారు రాజ మార్గమున - అపవిత్రులు పోజాలరందున ఉండదచ్చోట ఏ మృగ రాజును - పరిశుద్ధ దారిలో పరమగీతముతో 5. భయపడవలదని అభయంబిచ్చి - వారిని రక్షింప వేగమేరాగా ప్రతిదండన జేయు ప్రభువును జూచి - దిగులుతో జనులు వణకుచుండ 6. నిత్యము దహించు అగ్నిజ్వాలలలో - నుండగజాలినవారు ఎవరు? వేషదారులకు బీతిగనుండ పాపిగా - నుండిన నిలుతువెచ్చట 7. నీతిని బూని యదార్ధముగా - వీడిన పాపలాభమును నిత్యము నిలుచు సీయోను పురికి - ముదమున జేరి స్తుతింతువు 8. ఉన్నత పర్వత శిలలే వానికి - బలమైన మహాకోటగ కాగా కొదువేనుండదు తన ఆహారమును - పానమునకు హల్లేలూయ Pallavi: Yehovaa Vimochinchina Vaare - Paatalu Paaduchu Seeyonunaku Thirigi Vaththuru - Nithyaanandamu Kaligina Vaarai 1. Prabhuvaina Yasu Bhoolokamuna - Mahaaraajai Elaga Raaga Nithyaanandamutho Vijayasoochanatho - Manassuna Duhkhamu Nittoorpunu Leka 2. Aranyamunu Endina Bhoomiyu - Viriyabooyu Nullaasamutho Ghanadai Yehovaa Mahimanu Gaanchu - PrabhuKreesthuni Prabhaavamunu 3. Gruddiki Kannulu Chevitiki Chevulu - Kuntini Genthedi Duppigaa Jeya Sundarudaina Raajun Dendamuna Gaanchi - Moogavaani Naaluka Paadi Harshimpa 4. Payaninthuru Vaaru Raaja Maargamuna - Apavithrulu Pojaalaranduna Undadachchota E Mruga Raajunu - Parishuddha Daarilo Paramageethamutho 5. Bhayapadavaladani Abhayambichchi - Vaarini Rakshimpa Vegameraagaa Prathidandana Jeyu Prabhuvunu Joochi - Digulutho Janulu Vanakuchunda 6. Nithyamu Dahinchu Agnijvaalalalo - Nundagajaalinavaaru Evaru? Veshadaarulaku Beethiganunda Paapigaa - Nundina Niluthuvechchata 7. Neethini Booni Yadaardhamugaa - Veedina Paapalaabhamunu Nithyamu Niluchu Seeyonu Puriki - Mudamuna Jeri Sthuthinthuvu 8. Unnatha Parvatha Shilale Vaaniki - Balamaina Mahaakotaga Kaagaa Koduvenundadu Thana Aahaaramunu - Paanamunaku Hallelooya