యెహోవా మహోన్నతుడా మహిమయు నీదే - YouWorship
Yehovaa Mahonnathudaa Mahimayu Neede
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: యెహోవా మహోన్నతుడా - మహిమయు నీదే (2) ఇహమందు రక్షకా - మహి మంచి దాతవు (2) 1. పాలకుడవు పరమందు - ఏలికవు యెల్లరికి (2) చాలినట్టి ప్రధానుండా - సకల యధికారులకును (2) రాజులరాజు - ప్రభువుల ప్రభువు (2) ధరపర లోకములకు - దేవుడ వీవే (2) ధన్యుండ నీకే - ఘనమైన మహిమ (2) 2. పరమును విడచితివి - ధర కేతెంచితివి ప్రాణమీవు బలిగానిచ్చి - మమ్మును రక్షించితివి తిరిగి లేచి మాకు - కరుణ జీవమిచ్చితివి విరివగు నీ ప్రేమ - నరులపై చూపితివి ధర నీదే ఘనతయని - చరణముల పడుదుము 3. సంఘమందు మహిమ నీకే - సకల యుగములకు యుగమందు ప్రతి జీవి - యెహోవా యనియనున్ జగమంతటికి నీవు - నిజమైన ప్రభుడవు ఆదియంతమై నీవు - అలరారుచున్నావు యుగయుగములకు - ఘనమహిమ కలుగును Pallavi: Yehovaa Mahonnathudaa - Mahimayu Neede (2) Ihamandu Rakshakaa - Mahi Manchi Daathavu (2) 1. Paalakudavu Paramandu - Elikavu Yellariki (2) Chaalinatti Pradhaanundaa - Sakala Yadhikaarulakunu (2) Raajularaaju - Prabhuvula Prabhuvu (2) Dharapara Lokamulaku - Devuda Veeve (2) Dhanyunda Neeke - Ghanamaina Mahima (2) 2. Paramunu Vidachithivi - Dhara Kethenchithivi Praanameevu Baligaanichchi - Mammunu Rakshinchithivi Thirigi Lechi Maaku - Karuna Jeevamichchithivi Virivagu Nee Prema - Narulapai Choopithivi Dhara Neede Ghanathayani - Charanamula Padudumu 3. Sangghamandu Mahima Neeke - Sakala Yugamulaku Yugamandu Prathi Jeevi - Yehovaa Yaniyanun Jagamanthatiki Neevu - Nijamaina Prabhudavu Aadiyanthamai Neevu - Alaraaruchunnaavu Yugayugamulaku - Ghanamahima Kalugunu