యెహోవా మహాత్మ్యము గొప్పది యెంతో గ్రహింప శక్యము కానిది - YouWorship
Yehovaa Mahaathmyamu Goppadi Yentho Grahimpa Shakyamu Kaanidi
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: యెహోవా మహాత్మ్యము గొప్పది యెంతో (2) - గ్రహింప శక్యము కానిది (2) 1. పరలోక సైన్యమా పరమతండ్రి మహిమను (2) పరాక్రమ క్రియలు తెల్పెదము రారండి (2) పరిశుద్ధ దేవుని గొప్పకార్యముల్ (2) పరిశుద్ధ కార్యము ప్రకటింతుము (2) 2. మహాత్మ్యము గల్గిన దేవుడరుదెంచెను మహిమను విడచి నరుడుగ జన్మించె ఆహా సిలువలో సాతానును జయించె బాహాటముగా రక్షణ నొసగె మనకు 3. తప్పుపోతి మిలలో గొఱ్ఱెలను బోలియు తప్పులెన్నో చేసి శిక్షార్హుల మైతిమి అర్పించెను ప్రాణము మంచి కాపరియై గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను 4. ఆదామునందు పోయె దేవుని మహాత్మ్యము అంధులమై యుంటిమి అజ్ఞానుల మైతిమి నాథు డేసునందు పొందితిమి వెలుగు అధికమైన జ్ఞాన మహిమలొసగె 5. పాపముతో నిండిన పాపి నేడే రారమ్ము పాప ఫలితము మరణము సహింతువా? పాపుల రక్షకుడేసు రక్షింప నిలచే తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును 6. ప్రధానుల కంటెను అధికారులకన్న అధికుడు ప్రభువు రాజ్యమేల వచ్చును అంధరికి ప్రభువు శిరస్సై యున్నాడు అందరు పాడెదము హల్లెలూయా పాట Pallavi: Yehovaa Mahaathmyamu Goppadi Yentho (2) - Grahimpa Shakyamu Kaanidi (2) 1. Paraloka Sainyamaa Paramathandri Mahimanu (2) Paraakrama Kriyalu Thelpedamu Raarandi (2) Parishuddha Devuni Goppakaaryamul (2) Parishuddha Kaaryamu Prakatinthumu (2) 2. Mahaathmyamu Galgina Devudarudenchenu Mahimanu Vidachi Naruduga Janminche Aahaa Siluvalo Saathaanunu Jayinche Baahaatamugaa Rakshana Nosage Manaku 3. Thappupothi Milalo Gorrelanu Boliyu Thappulenno Chesi Shikshaarhula Maithimi Arpinchenu Praanamu Manchi Kaapariyai Goppa Rakshananichchi Uddharinchenu 4. Aadaamunandu Poye Devuni Mahaathmyamu Andhulamai Yuntimi Agnaanula Maithimi Naathu Desunandu Pondithimi Velugu Adhikamaina Gnaana Mahimalosage 5. Paapamutho Nindina Paapi Nede Raarammu Paapa Phalithamu Maranamu Sahinthuvaa? Paapula Rakshakudesu Rakshimpa Nilache Thappuloppukonumu Ninnu Rakshinchunu 6. Pradhaanula Kantenu Adhikaarulakanna Adhikudu Prabhuvu Raajyamela Vachchunu Andhariki Prabhuvu Shirassai Yunnaadu Andaru Paadedamu Hallelooyaa Paata