యెహోవా నీ యొక్క మాట చొప్పున - YouWorship
Yehovaa Nee Yokka Maata Choppuna
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యెహోవా నీ యొక్క మాట చొప్పున (2) నీ దాసునికి మేలు చేసియున్నావు (2) 1. మంచి వివేచన మంచి జ్ఞానము (2) - కర్త నీవే నాకు బోధ చేయుము (2) నీ యాజ్ఞలందు నమ్మిక నుంచితిని (2) 2. నాకు శ్రమ కలుగక మునుపు - నా దేవా నేను త్రోవ వీడితిని నేడు నీ మాట నెరవేర్చు చున్నాను 3. దేవా నీవు దయగలవాడవు - దేవా నీవు మేలు చేయుచున్నావునీ కట్టడల నాకు బోధించుము 4. గర్విష్ఠులు నాకు విరోధముగా - కల్పించుదురెన్నో అబద్ధములు నీ యుపదేశము లనుసరింతును 5. వారి హృదయములు క్రొవ్వువలె - చాల మందముగానై యున్నవి ఆజ్ఞలలో ఆనందించుచున్నాను 6. దేవా నేను నీ కట్టడలను - నేర్చుకొనునట్లు శ్రమల నొంది యుండుట నాకు యెంతో మేలాయెను 7. వేలాది వెండి నాణెముల కంటె - వేలాది బంగారు నాణెముల కంటె నీ విచ్చిన ఆజ్ఞలు నాకు మేలు Pallavi: Yehovaa Nee Yokka Maata Choppuna (2) Nee Daasuniki Melu Chesiyunnaavu (2) 1. Manchi Vivechana Manchi Gnaanamu (2) - Kartha Neeve Naaku Bodha Cheyumu (2) Nee Yaagnalandu Nammika Nunchithini (2) 2. Naaku Shrama Kalugaka Munupu - Naa Devaa Nenu Throva Veedithini Nedu Nee Maata Neraverchu Chunnaanu 3. Devaa Neevu Dayagalavaadavu - Devaa Neevu Melu Cheyuchunnaavunee Kattadala Naaku Bodhinchumu 4. Garvishthulu Naaku Virodhamugaa - Kalpinchudurenno Abaddhamulu Nee Yupadeshamu Lanusarinthunu 5. Vaari Hrudayamulu Krovvuvale - Chaala Mandamugaanai Yunnavi Aagnalalo Aanandinchuchunnaanu 6. Devaa Nenu Nee Kattadalanu - Nerchukonunatlu Shramala Nondi Yunduta Naaku Yentho Melaayenu 7. Velaadi Vendi Naanemula Kante - Velaadi Banggaaru Naanemula Kante Nee Vichchina Aagnalu Naaku Melu