యెహోవా నీ దిక్కునకు నా ఆత్మను - YouWorship
Yehovaa Nee Dikkunaku Naa Aathmanu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యెహోవా నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తుచున్నాను - నీపై నమ్మిక యుంచితిని - నన్నెన్నడు సిగ్గు పడనీయ్యకు (2) యెహోవా నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తుచున్నాను (1) 1. ఎందరు నీకై కనిపెట్టెదరో - వారందరును సిగునొందరుగా (2) ద్రోహము చేయువారందరును (2) - తప్పక సిగ్గునొందెదరు (1) 2. అతిశయించుచున్నాను దేవా - నా హృదయమున నిన్ను బట్టి సంతోషింతురు దానిని వినగా - ఆత్మలో దీనులగువారు 3. ఉత్తరమిచ్చెను నా యెహోవా - తన యొద్దనే విచారణ చేయగ తప్పించెనుగా ఆయనే నన్ను - ప్రతివిధ భయములనుండియును 4. ఆయన తట్టు చూచెడువారికి - ధీటైన వెలుగు కలుగును గాన లజ్జింపకుండును వారి ముఖంబులు - ఎన్నటెన్నటికైన నా దేవా 5. యధార్థహృదయులందరిని దేవా - బలపరచుటకై నీకనుదృష్టి సంచారము చేయు లోకమంతటను - సంక్షేమమును కోరినదై 6. యెహోవా నాకిల సహాయుడవై - నన్నాదరించు చున్నావు నీవు చూపుము నాకు శుభ సూచనను - నా పగవారు సిగ్గు నొంద 7. హృదయ పూర్తిగా చెల్లించెదను - వందిత నీకు నా కృతజ్ఞతలు నిత్యము నేను నీ నామమును - మహిమపరతును నాప్రభువా Pallavi: Yehovaa Nee Dikkunaku Naa Aathmanu Eththuchunnaanu - Neepai Nammika Yunchithini - Nannennadu Siggu Padaneeyyaku (2) Yehovaa Nee Dikkunaku Naa Aathmanu Eththuchunnaanu (1) 1. Endaru Neekai Kanipettedaro - Vaarandarunu Sigunondarugaa (2) Drohamu Cheyuvaarandarunu (2) - Thappaka Siggunondedaru (1) 2. Athishayinchuchunnaanu Devaa - Naa Hrudayamuna Ninnu Batti Santhoshinthuru Daanini Vinagaa - Aathmalo Deenulaguvaaru 3. Uththaramichchenu Naa Yehovaa - Thana Yoddane Vichaarana Cheyaga Thappinchenugaa Aayane Nannu - Prathividha Bhayamulanundiyunu 4. Aayana Thattu Choocheduvaariki - Dheetaina Velugu Kalugunu Gaana Lajjimpakundunu Vaari Mukhambulu - Ennatennatikaina Naa Devaa 5. Yadhaarthahrudayulandarini Devaa - Balaparachutakai Neekanudrushti Sanchaaramu Cheyu Lokamanthatanu - Sangkshemamunu Korinadai 6. Yehovaa Naakila Sahaayudavai - Nannaadarinchu Chunnaavu Neevu Choopumu Naaku Shubha Soochananu - Naa Pagavaaru Siggu Nonda 7. Hrudaya Poorthigaa Chellinchedanu - Vanditha Neeku Naa Kruthagnathalu Nithyamu Nenu Nee Naamamunu - Mahimaparathunu NaaPrabhuvaa