యెహోవా నీ కోపము చేత గద్దింపకుము - YouWorship
Yehovaa Nee Kopamu Chetha Gaddimpakumu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. యెహోవా నీ కోపము చేత - గద్దింపకుము - ఆ (2) నీదు యుగ్రతచే నన్ను - శిక్షింపకుము (1) 2. నాలో గట్టిగా నీ బాణములు - నాటి యున్నవి - ఆ నా మీద నీ చెయ్యి భార - ముగా నున్నది 3. నీ కోపముచే నా యారోగ్యము - విడిచిపోయెను - ఆ పాపముచే నా యెముకలలో - స్వస్థత లేదు 4. నా దోషములు నా తలమీద - పొర్లిపోయినవి - ఆ నాపై మోయలేని బరువు - వలె నున్నవి 5. మూర్ఖతచే నా గాయములు - దుర్వాసనబట్టే - ఆ దుఃఖా క్రాంతుడనై - దినమెల్ల తిరుగుచున్నాను 6. నా నడుము తాపముచే నిండి - ఆరోగ్యములేదు - ఆ నేను సొమ్మసిల్లి బహుగా - నలిగియున్నాను 7. మనోవేదన బట్టి కేకలు - వేయుచున్నాను - ఆ కనబడుచున్నది నీకు నా యభి - లాషయంతయు 8. నా నిట్టూర్పులు నీకు దాచ - బడియుండలేదు - ఆ నా గుండె కొట్టుకొని బలము - విడచిపోయెను 9. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను - ఆ నా పాపమును గూర్చి విచారపడుచున్నాను 10. నా శత్రువులు చురుకై బలము - కలిగిన వారు - ఆ నన్నుచితముగా ద్వేషించు వారు అనేకులు 11. మేలుకు ప్రతిగా వారు - కీడు - చేయుచున్నారు - ఆ మేలు చేసినందుకు వారు - విరోధులైరి 12. దేవా నాకు దూరముగా - నుండకుము ప్రభో - ఆ రక్షకా నా సహాయమునకు - వేగమే రమ్ము 1. Yehovaa Nee Kopamu Chetha - Gaddimpakumu - Aa (2) Needu Yugrathache Nannu - Shikshimpakumu (1) 2. Naalo Gattigaa Nee Baanamulu - Naati Yunnavi - Aa Naa Meeda Nee Cheyyi Bhaara - Mugaa Nunnadi 3. Nee Kopamuche Naa Yaarogyamu - Vidichipoyenu - Aa Paapamuche Naa Yemukalalo - Svasthatha Ledu 4. Naa Doshamulu Naa Thalameeda - Porlipoyinavi - Aa Naapai Moyaleni Baruvu - Vale Nunnavi 5. Moorkhathache Naa Gaayamulu - Durvaasanabatte - Aa Duhkhaa Kraanthudanai - Dinamella Thiruguchunnaanu 6. Naa Nadumu Thaapamuche Nindi - Aarogyamuledu - Aa Nenu Sommasilli Bahugaa - Naligiyunnaanu 7. Manovedana Batti Kekalu - Veyuchunnaanu - Aa Kanabaduchunnadi Neeku Naa Yabhi - Laashayanthayu 8. Naa Nittoorpulu Neeku Daacha - Badiyundaledu - Aa Naa Gunde Kottukoni Balamu - Vidachipoyenu 9. Naa Doshamunu Nenu Oppukonuchunnaanu - Aa Naa Paapamunu Goorchi Vichaarapaduchunnaanu 10. Naa Shathruvulu Churukai Balamu - Kaligina Vaaru - Aa Nannuchithamugaa Dveshinchu Vaaru Anekulu 11. Meluku Prathigaa Vaaru - Keedu - Cheyuchunnaaru - Aa Melu Chesinanduku Vaaru - Virodhulairi 12. Devaa Naaku Dooramugaa - Nundakumu Prabho - Aa Rakshakaa Naa Sahaayamunaku - Vegame Rammu