యెహోవా నా బలమా - YouWorship
Yehovaa Naa Balamaa
Artist: జాన్ గొల్లపల్లి
Category: Worship
Song Lyrics
యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం (2) ||యెహోవా|| నా శత్రువులు నను చుట్టిననూ నరకపు పాశములరికట్టిననూ (2) వరదవలె భక్తిహీనులు పొర్లిన (2) విడువక నను ఎడబాయని దేవా (2) ||యెహోవా|| మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షనశృంగమై (2) తన ఆలయములో నా మొఱ్ఱ వినెను (2) ఆదరెను ధరణి భయకంపముచే (2) ||యెహోవా|| నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును (2) జలరాసులనుండి బలమైన చేతితో (2) వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2) ||యెహోవా|| పౌరుషముగల ప్రభు కొపింపగా పర్వతముల పునాదులు వణకెను (2) తన నోటనుండి వచ్చిన అగ్ని (2) దహించివేసెను వైరులనెల్లన్ (2) ||యెహోవా|| మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగ జేయును (2) ఉరుముల మెరుపుల మెండుగ జేసి (2) అపజయమిచ్చును అపవాదికిని (2) ||యెహోవా|| దయగలవారిపై దయ చూపించును కఠినులయెడల వికటము జూపును (2) గర్విష్టుల యొక్క గర్వమునణుచును (2) సర్వమునెరిగిన సర్వాధికారి (2) ||యెహోవా|| నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి (2) రక్షణ కేడెము నాకందించి (2) అక్షయముగ తన పక్షము జేర్చిన (2) ||యెహోవా|| యెహోవా జీవముగల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే (2) అన్యజనులలో ధన్యత చూపుచు (2) హల్లెలూయ స్తుతిగానము చేసెద (2) ||యెహోవా|| Yehovaa Naa Balamaa Yadhaarthamainadi Nee Maargam Paripoornamainadi Nee Maargam (2) ||Yehovaa|| Naa Shathruvulu Nanu Chuttinanoo Narakapu Paashamularikattinanoo (2) Varadavale Bhakthiheenulu Porlina (2) Vadalaka Nanu Edabaayani Devaa (2) ||Yehovaa|| Maranaputurulalo Maruvaka Moralida Unnathadurgamai Rakshanasrungamai (2) Thana Aalayamulo Naa Mora Vinenu (2) Adarenu Dharani Bhayakampamuche (2) ||Yehovaa|| Naa Deepamunu Veliginchuvaadu Naa Cheekatini Veluguga Cheyunu (2) Jalaraasulanundi Balamaina Chethitho (2) Velupala Cherchina Balamaina Devudu (2) ||Yehovaa|| Pourushamugala Prabhu Kopimpagaa Parvathamula Punaadulu Vanakenu (2) Thana Notanundi Vachchina Agni (2) Dahinchivesenu Vairulanellan (2) ||Yehovaa|| Meghamulapai Aayana Vachchunu Meghamulanu Thana Maatuga Jeyunu (2) Urumula Merupula Menduga Jesi (2) Apajayamichchunu Apavaadikini (2) ||Yehovaa|| Dayagala Vaaripai Daya Choopinchunu Katinulayedala Vikatamu Joopunu (2) Garvishtula Yokka Garvamunanuchunu (2) Sarvamu Nerigina Sarvaadhikaari (2) ||Yehovaa|| Naa Kaallanu Ledi Kaalluga Jeyunu Eththaina Sthalamulo Shakthitho Nilipi (2) Rakshana Kedemu Naakandinchi (2) Akshayamuga Thana Pakshamu Jerchina (2) ||Yehovaa|| Yehovaa Jeevamugala Devaa Bahugaa Sthuthulaku Arhuda Neeve (2) Anyajanulalo Dhanyatha Choopuchu (2) Hallelooya Sthuthigaanamu Cheseda (2) ||Yehovaa||