యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతియించెద - YouWorship
Yehovaa Naa Devaa Nithyamu Nenu Ninnu Sthuthiyincheda
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: యెహోవా నా దేవా నిత్యము - నేను నిన్ను స్తుతియించెద (2) హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ (2) 1. యెహోవా నా శత్రువులను - నా పై సంతోషింపనీయక (2) నీవు నన్నుద్ధరించినందుకై నేను - నిన్ను కొనియాడుచున్నాను (2) 2. నేను నీకు మొరపెట్టగా - నీవు నన్ స్వస్థపరచితివి పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి - భక్తులారా ప్రభున్ కీర్తించుడు 3. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీసితివి నేను సమాధిలోకి దిగకుండగ - నీవు నన్ను బ్రతికించితివి 4. ఆయన కోపము నిమిషమే - దయ ఆయుష్కాలముండును ఏడ్పు వచ్చి రాత్రియుండిన ఉదయ - మున సంతోషము కలుగును 5. నే నెన్నడు కదలనని నా - క్షేమ కాలమున తలచితి యెహోవా దయ కలిగి నీవే నా - పర్వతము స్థిరపరచితివి 6. నీ ముఖము నీవు దాచిన - యపుడు నేను క్షోభిల్లితి యెహోవా నీకే మొర పెట్టితిని - నా ప్రభువును బ్రతిమాలు కొంటిని 7. నేను సమాధిలోకి దిగిన - నా ప్రాణము వలన లాభమా మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా 8. నా అంగలార్పును నీవేగా - నాట్యముగా మార్చియుంటివి నా గోనెపట్ట విడిపించి సంతోష - వస్త్రము ధరింప జేసితివి Pallavi: Yehovaa Naa Devaa Nithyamu - Nenu Ninnu Sthuthiyincheda (2) Hallelooya Hallelooya - Hallelooya Hallelooya (2) 1. Yehovaa Naa Shathruvulanu - Naa Pai Santhoshimpaneeyaka (2) Neevu Nannuddharinchinandukai Nenu - Ninnu Koniyaaduchunnaanu (2) 2. Nenu Neeku Morapettagaa - Neevu Nan Svasthaparachithivi Parishuddha Gnaapakaartha Naamamunu Batti - Bhakthulaaraa Prabhun Keerthinchudu 3. Yehovaa Paathaalamulo Nundi Naa Praanamu Levadeesithivi Nenu Samaadhiloki Digakundaga - Neevu Nannu Brathikinchithivi 4. Aayana Kopamu Nimishame - Daya Aayushkaalamundunu Edpu Vachchi Raathriyundina Udaya - Muna Santhoshamu Kalugunu 5. Ne Nennadu Kadalanani Naa - Kshema Kaalamuna Thalachithi Yehovaa Daya Kaligi Neeve Naa - Parvathamu Sthiraparachithivi 6. Nee Mukhamu Neevu Daachina - Yapudu Nenu Kshobhillithi Yehovaa Neeke Mora Pettithini - Naa Prabhuvunu Brathimaalu Kontini 7. Nenu Samaadhiloki Digina - Naa Praanamu Valana Laabhamaa Mannu Ninnu Sthuthinchunaa? Nee Sathyamunu Goorchi Adi Vivarinchunaa 8. Naa Anggalaarpunu Neevegaa - Naatyamugaa Maarchiyuntivi Naa Gonepatta Vidipinchi Santhosha - Vasthramu Dharimpa Jesithivi