యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరికొరకు - YouWorship
Yehovaa Goppa Kaaryamulu Chesenu Veerikoraku
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: యెహోవా - గొప్ప కార్యములు - చేసెను - వీరికొరకు (1) ఇహమున - అన్యజనము - లెల్ల - చెప్పుకొనుచున్నారటుల (2) 1. యెహోవా మనకొరకు - గొప్ప కార్యములు చేసెను (2) మహా సంతోషభరితుల మైతివిు - సహపనివారినిగా జేసెన్ (2) 2. ప్రారంభ కాలపనులను - పరిహసించువారెవరు ప్రభు పనిచేయ పదివేలగు నొకడు - విరవిగ బలమౌ జన మగును 3. ప్రభు సువార్తకై బహుగా మేము - బాధించబడి యుంటిమి ప్రబలెను ప్రభుని వాక్యము - ప్రబలితిమి మేము ప్రభు కృపలో 4. పొరపాటులెన్నో చేసితిమి - ప్రభుకృపతో మమ్ము క్షమించెన్ విరోధి మంత్ర శకునము లేమి - ఇశ్రాయేలులో నికలేవు 5. భూమిపై గడ్డిని తడుపు - వానవలె విజయము నిచ్చెను సమ భూమిని బోలి సముద్రములో - క్షేమముగా మము నడిపెను 6. అధికంబాయె మా అంత్యదశ - మొదటి పనులను మించెన్ మొదటి మందిర మహిమను మించె - తుది మందిరపు మహిమ 7. మహిమ ఘనతా ప్రభావములు - మా కృతజ్ఞతా స్తోత్రములు సింహాసనాసీనుండా మాదు - సీయోను రాజా హల్లెలూయా Pallavi: Yehovaa - Goppa Kaaryamulu - Chesenu - Veerikoraku (1) Ihamuna - Anyajanamu - Lella - Cheppukonuchunnaaratula (2) 1. Yehovaa Manakoraku - Goppa Kaaryamulu Chesenu (2) Mahaa Santhoshabharithula Maithivi - Sahapanivaarinigaa Jesen (2) 2. Praarambha Kaalapanulanu - Parihasinchuvaarevaru Prabhu Panicheya Padivelagu Nokadu - Viraviga Balamau Jana Magunu 3. Prabhu Suvaarthakai Bahugaa Memu - Baadhinchabadi Yuntimi Prabalenu Prabhuni Vaakyamu - Prabalithimi Memu Prabhu Krupalo 4. Porapaatulenno Chesithimi - PrabhuKrupatho Mammu Kshaminchen Virodhi Manthra Shakunamu Lemi - Ishraayelulo Nikalevu 5. Bhoomipai Gaddini Thadupu - Vaanavale Vijayamu Nichchenu Sama Bhoomini Boli Samudramulo - Kshemamugaa Mamu Nadipenu 6. Adhikambaaye Maa Anthyadasha - Modati Panulanu Minchen Modati Mandira Mahimanu Minche - Thudi Mandirapu Mahima 7. Mahima Ghanathaa Prabhaavamulu - Maa Kruthagnatha Sthothramulu Sinhaasanaaseenundaa Maadu - Seeyonu Raajaa Hallelooyaa