యెహోవా గద్దె ముందట - YouWorship
Yehovaa Gadde Mumdata
Artist: ఐజక్ వాట్స్
Category: Praise
Song Lyrics
1. యెహోవా గద్దె ముందట జనంబులార మొక్కుండి యెహోవా దేవుండే సుమి సృజింపం జంపం గర్తయే. 2. స్వశక్తిచేత నాయనే మనలన్ సృజించె మట్టిచే భ్రమించు గొఱ్ఱె రీతిగా దప్పంగ మళ్ళి చేర్చెను. 3. సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధిచేతు మాయనన్ జగత్తు వేయి నోళ్ళతో స్తుతించు దివ్యమౌ ధ్వనిన్. 4. ప్రభుత్వ ముండు నంతకున్ అగున్ నీ ప్రేమ నిత్యము చిరంబు నీదు సత్యము వసించు నెల్లకాలము. 1. Yehovaa Gadde Mumdata Janambulaara Mokkumdi Yehovaa Devumde Sumi Srujimpam Jampam Garthaye. 2. Svashakthichetha Naayane Manalan Srujimche Mattiche Bhramimchu Gorre Reethigaa Dappamga Malli Cherchenu. 3. Sukeerthi Paadi Gumpulai Prasiddhichethu Maayanan Jagaththu Veyi Nollatho Sthuthimchu Divyamau Dhvanin. 4. Prabhuthva Mumdu Namthakun Agun Nee Prema Nithyamu Chirambu Needu Sathyamu Vasimchu Nellakaalamu.