యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్ - YouWorship
Yehovaa Koraku Sahanamutho Kanipettan
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్ నాకు చెవియొగ్గి నా మొఱ నాలకించెన్ నాశనమగు గుంటలో నుండియు జిగటగల దొంగయూబి నుండి నన్ పై కెత్తెను (2) 1. నా పాదములను బండపై నిలిపి - నా యడుగులు దానిపై స్థిరపచి (2) క్రొత్త గీతమును నా నోట నుంచెను కోట్ల కొలది యెహోవాను నమ్మెదరు (2) 2. గర్విష్టుల నబద్ధికులను లక్ష్యపెట్టక -ఘనుడెహోవాను నమ్మువాడే ధన్యుండు దయామయా మా యెడల నీకున్న తలంపులు బహు విస్తారములు 3. వాటిని వివరింప లేనిల నీకు - సాటియైన వాడెవడైనను లేడు నైవేద్య బలులను కోరలేదు నాకు చెవులను నీవు నిర్మించినావు 4. పాపపరిహార బలులను దహన -బలులను నీవు తెమ్మన లేదు నన్ను గూర్చి గ్రంథములో వ్రాసి యున్నట్లుగా నేను వచ్చియున్నాను 5. నీ చిత్తముచేయ నాకు సంతోషము - నా ఆంతర్యములో నీ శాసనములున్నవి ప్రజా సంఘములో నీ నీతి సువార్త ప్రకటించియున్నానని నేనంటిని 6. నీ నీతిని నా మదిలో దాల్చి - నీతి నిలయ నే నూరకుండ లేదు సంఘములో నీ రక్షణ కృపను సత్యమును నే దాచలేదు Pallavi: Yehovaa Koraku Sahanamutho Kanipettan Naaku Cheviyoggi Naa Mora Naalakinchen Naashanamagu Guntalo Nundiyu Jigatagala Donggayoobi Nundi Nan Pai Keththenu (2) 1. Naa Paadamulanu Bandapai Nilipi - Naa Yadugulu Daanipai Sthirapachi (2) Kroththa Geethamunu Naa Nota Nunchenu Kotla Koladi Yehovaanu Nammedaru (2) 2. Garvishtula Nabaddhikulanu Lakshyapettaka -Ghanudehovaanu Nammuvaade Dhanyundu Dayaamayaa Maa Yedala Neekunna Thalampulu Bahu Visthaaramulu 3. Vaatini Vivarimpa Lenila Neeku - Saatiyaina Vaadevadainanu Ledu Naivedya Balulanu Koraledu Naaku Chevulanu Neevu Nirminchinaavu 4. Paapaparihaara Balulanu Dahana -Balulanu Neevu Themmana Ledu Nannu Goorchi Granthamulo Vraasi Yunnatlugaa Nenu Vachchiyunnaanu 5. Nee Chiththamucheya Naaku Santhoshamu - Naa Aantharyamulo Nee Shaasanamulunnavi Prajaa Sangghamulo Nee Neethi Suvaartha Prakatinchiyunnaanani Nenantini 6. Nee Neethini Naa Madilo Daalchi - Neethi Nilaya Ne Noorakunda Ledu Sangghamulo Nee Rakshana Krupanu Sathyamunu Ne Daachaledu