యెహోవా కార్యములన్నిటికై అర్పింతు కృతజ్ఞతలు - YouWorship
Yehovaa Kaaryamulannitikai Arpinthu Kruthagnathalu
Artist: సీయోను గీతాలు
Category: Thanksgiving
Song Lyrics
పల్లవి: యెహోవా కార్యములన్నిటికై - అర్పింతు కృతజ్ఞతలు (2) ఆశించెడి వారి ప్రాణములెల్లను (2) - సంతృప్తి పరచెదవు (1) 1. వెదకిన నా మది కొసగెను రక్షణ - దర్శనమిచ్చి దరి జేర్చితివి (2) నీ రాజ్యమును నీ నీతియును వెదకుమని నన్ను - ప్రేమతో పిలిచితివి (2) 2. కనిపించెడి ఆ కానానును జూడ - ధన్యతలకది ధననిధిగా నుండె దానిపై నుండు నీకను దృష్టి దివా రాత్రులు ప్రియమది నీకెంతో 3. నూతన మాయెను భూమ్యాకాశముల్ - పాపముల్ పడిన సముద్రములేదట పరిశుద్ధంబైన యెరూషలేమది దేవుని మహిమతో దిగివచ్చుచుండె 4. కళంకము లేక - అలంకరించిన - పెండ్లి కుమార్తెయై - ప్రియునిజూచు సంఘము యిదియే - ప్రియుడా కనుమా కానవు నెచ్చటన్ - ఈ వజ్రకాంతుల్ 5. శిల్పియై యెహోవా - నిర్మించుచున్న పండ్రెండు పునాదుల - ఆ పట్టణముకై నబ్రహాము ఎదురు చూచెనుగా పరికించుము నీవు - నీ కన్నుల నెత్తి 6. కుక్కలు మాంత్రికులు - వ్యభిచారులును నరహంతకులును - విగ్రహారాధికులు అబద్దమును - ప్రేమించి జరిగించు ప్రతివాడునట - వెలుపట నుందురుగా 7. కృప కాలంబిది - ఓ నా ప్రియుడా - నిర్మల వాక్యమన్ - పాలను పొంది శిశువును బోలి - ఎదుగుము నీవు పదములు నేర్తువు - అపవాది నెదిరింపన్ Pallavi: Yehovaa Kaaryamulannitikai - Arpinthu Kruthagnathalu (2) Aashinchedi Vaari Praanamulellanu (2) - Santhrupthi Parachedavu (1) 1. Vedakina Naa Madi Kosagenu Rakshana - Darshanamichchi Dari Jerchithivi (2) Nee Raajyamunu Nee Neethiyunu Vedakumani Nannu - Prematho Pilichithivi (2) 2. Kanipinchedi Aa Kaanaanunu Jooda - Dhanyathalakadi Dhananidhigaa Nunde Daanipai Nundu Neekanu Drushti Divaa Raathrulu Priyamadi Neekentho 3. Noothana Maayenu Bhoomyaakaashamul - Paapamul Padina Samudramuledata Parishuddhambaina Yerooshalemadi Devuni Mahimatho Digivachchuchunde 4. Kalangkamu Leka - Alangkarinchina - Pendli Kumaartheyai - Priyunijoochu Sangghamu Yidiye - Priyudaa Kanumaa Kaanavu Nechchatan - Ee Vajrakaanthul 5. Shilpiyai Yehovaa - Nirminchuchunna Pandrendu Punaadula - Aa Pattanamukai Nabrahaamu Eduru Choochenugaa Parikinchumu Neevu - Nee Kannula Neththi 6. Kukkalu Maanthrikulu - Vyabhichaarulunu Narahanthakulunu - Vigrahaaraadhikulu Abaddamunu - Preminchi Jariginchu Prathivaadunata - Velupata Nundurugaa 7. Krupa Kaalambidi - O Naa Priyudaa - Nirmala Vaakyaman - Paalanu Pondi Shishuvunu Boli - Edugumu Neevu Padamulu Nerthuvu - Apavaadi Nedirimpan