యెహోవా ఇల్లు కట్టించని యెడల - YouWorship
Yehovaa Illu Kattinchani Yedala
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యెహోవా ఇల్లు కట్టించని యెడల - దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కాయువారు మేల్కొనినను వ్యర్థమే 1. మీరు వేకువనే లేచి రాత్రియైన తర్వాత పండు కొనుచు మీరు - తర్వాత పండు కొనుచు (1) ఆర్జితమైన ఆహారమును (2) మీరు తినుచుండుట - వ్యర్థమే - మీరు తినుచుండుట 2. తన ప్రియులు నిద్రించుచుండగా తానే యిచ్చు చున్నాడు - వారికి - తానేయిచ్చుచున్నాడు తనయులు దేవుడిచ్చు స్వాస్థ్యము కనెడి గర్భఫలము - బహుమానమే - కనెడి గర్భఫలము 3. యౌవన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని - బాణములు - బలవంతుని చేతిలోని తన అంబుల పొదిని నింపుకొనువాడు ధన్యుడు అట్టివాడు - బహుగా - ధన్యుడు అట్టివాడు 4. యెహోవా యందు భయభక్తులు కలిగి నడచు వారందరును - ధన్యులు - నడచు వారందరును మహా మేలు నీకు కలుగును నిశ్చయముగా నీవు - ధన్యుడవు - నిశ్చయముగా నీవు 5. నీవు ధన్యుడవు లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి - వలె నుండు - ఫలించు ద్రాక్షావల్లి భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె - నుందురు -ఒలీవ మొక్కల వలె 6. యెహోవా యందు భయభక్తి గలవాడు ఆశీర్వదింపబడును నిజముగా - ఆశీర్వదింపబడును యెహోవా నిన్ను సీయోను నుండి ఆశీర్వదించును - బహుగా - ఆశీర్వదించును 7. నీ జీవితమంతా యెరూషలేముకు క్షేమము కలుగుటయే - జూతువు - క్షేమము కలుగుటయే నీ పిల్లల పిల్లలను చూతువు నీవు ఇశ్రాయేలు మీద - నిత్యము - సమాధానముండును Pallavi: Yehovaa Illu Kattinchani Yedala - Daani Kattuvaari Prayaasamunu Vyarthame Yehovaa Pattanamunu Kaapaadani Yedala Daani Kaayuvaaru Melkoninanu Vyarthame 1. Meeru Vekuvane Lechi Raathriyaina Tharvaatha Pandu Konuchu Meeru - Tharvaatha Pandu Konuchu (1) Aarjithamaina Aahaaramunu (2) Meeru Thinuchunduta - Vyarthame - Meeru Thinuchunduta 2. Thana Priyulu Nidrinchuchundagaa Thaane Yichchu Chunnaadu - Vaariki - Thaaneyichchuchunnaadu Thanayulu Devudichchu Svaasthyamu Kanedi Garbhaphalamu - Bahumaaname - Kanedi Garbhaphalamu 3. Yauvana Kaalamuna Puttina Kumaarulu Balavanthuni Chethiloni - Baanamulu - Balavanthuni Chethiloni Thana Ambula Podini Nimpukonuvaadu Dhanyudu Attivaadu - Bahugaa - Dhanyudu Attivaadu 4. Yehovaa Yandu Bhayabhakthulu Kaligi Nadachu Vaarandarunu - Dhanyulu - Nadachu Vaarandarunu Mahaa Melu Neeku Kalugunu Nishchayamugaa Neevu - Dhanyudavu - Nishchayamugaa Neevu 5. Neevu Dhanyudavu Logita Nee Bhaarya Phalinchu Draakshaavalli - Vale Nundu - Phalinchu Draakshaavalli Bhojanapu Ballachuttu Nee Pillalu Oleeva Mokkala Vale - Nunduru -Oleeva Mokkala Vale 6. Yehovaa Yandu Bhayabhakthi Galavaadu Aasheervadimpabadunu Nijamugaa - Aasheervadimpabadunu Yehovaa Ninnu Seeyonu Nundi Aasheervadinchunu - Bahugaa - Aasheervadinchunu 7. Nee Jeevithamanthaa Yerooshalemuku Kshemamu Kalugutaye - Joothuvu - Kshemamu Kalugutaye Nee Pillala Pillalanu Choothuvu Neevu Ishraayelu Meeda - Nithyamu - Samaadhaanamundunu