యెహోవాయే మనదేవుడు మార్పులేనివాడు - YouWorship
Yehovaaye ManaDevudu Maarpulenivaadu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: యెహోవాయే మనదేవుడు - మార్పులేనివాడు (2) నిన్న నేడు నిరంతరము - ఒకే రీతిగా ఉన్నాడు (2) 1. పాపశాపముల బాప - మానవ రూపి ఆయెను అద్భుత ప్రేమ జూపి - మనలను తానె రక్షించెను 2. తన రెక్కలతో కప్పి - ఆశ్రయమిచ్చును ఆయనె స్వరక్త మిచ్చి కొన్న - తన సంఘమును కాయును 3. క్రుంగిన వేళలందు - అభయమునిచ్చె దేవుడు తన హస్తముతో నిలిపి - అంతమువరకు ఆదుకొనున్ 4. శాశ్వత ప్రేమ జూపి - శ్రమలలో విజయ మిచ్చును విశ్వమంతయు మారిన - ఎన్నడుమారడు మనయేసు 5. సంఘముగా చేరి - యెహోవాకే మొర్ర పెట్టెదము ఆపత్కాలము నందు - ఉత్తరమిచ్చును ఆయనె Pallavi: Yehovaaye ManaDevudu - Maarpulenivaadu (2) Ninna Nedu Nirantharamu - Oke Reethigaa Unnaadu (2) 1. Paapashaapamula Baapa - Maanava Roopi Aayenu Adbhutha Prema Joopi - Manalanu Thaane Rakshinchenu 2. Thana Rekkalatho Kappi - Aashrayamichchunu Aayane Svaraktha Michchi Konna - Thana Sangghamunu Kaayunu 3. Krunggina Velalandu - Abhayamunichche Devudu Thana Hasthamutho Nilipi - Anthamuvaraku Aadukonun 4. Shaashvatha Prema Joopi - Shramalalo Vijaya Michchunu Vishvamanthayu Maarina - Ennadumaaradu ManaYesu 5. Sangghamugaa Cheri - Yehovaake Morra Pettedamu Aapathkaalamu Nandu - Uththaramichchunu Aayane