యెహోవాయె మనకందరికి ఎన్నియో మేలుల జేసెన్ - YouWorship
Yehovaaye Manakandariki Enniyo Melula Jesen
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: యెహోవాయె మనకందరికి - ఎన్నియో మేలుల జేసెన్ తన కృప కనికరముల్ - స్మరియించి స్తుతించెదము యెహోవాయె మనకందరికి 1. మన మాయన జనము - ఆయన సంతతియు (2) సిలువ మరణముద్వారా మనకు - తనదు జీవమునిచ్చె (2) ఎంత అద్భుత రక్షకుడు (2) 2. అడుగువాటికంటె - అధికముగ నిచ్చె తన నిబంధనను స్థిరపరచి - తన వాక్కులు నెరవేర్చె మాట తప్పనివాడవు 3. కష్టదుఃఖములందు - పాలివాడాయె ప్రేమనుజూపి ప్రభువే మనల - తన రెక్కలపై మోసె మనతో నుండును నిరతము (2) 4. ఎన్నిసార్లు ప్రభుని - దుఃఖపరచితిమి అయినను ప్రభువే తన దయజూపి - మనలన్ క్షమియించెనుగా ప్రేమగల మా తండ్రివి 5. నీవే మా దుర్గమును - కేడెము నీవే నిన్ను మేము నమ్మియున్నాము - మాకు సర్వము నీవే మేము నీదు ప్రజలము Pallavi: Yehovaaye Manakandariki - Enniyo Melula Jesen Thana Krupa Kanikaramul - Smariyinchi Sthuthinchedamu Yehovaaye Manakandariki 1. Mana Maayana Janamu - Aayana Santhathiyu (2) Siluva Maranamudvaaraa Manaku - Thanadu Jeevamunichche (2) Entha Adbhutha Rakshakudu (2) 2. Aduguvaatikante - Adhikamuga Nichche Thana Nibandhananu Sthiraparachi - Thana Vaakkulu Neraverche Maata Thappanivaadavu 3. Kashtaduhkhamulandu - Paalivaadaaye Premanujoopi Prabhuve Manala - Thana Rekkalapai Mose Manatho Nundunu Nirathamu (2) 4. Ennisaarlu Prabhuni - Duhkhaparachithimi Ayinanu Prabhuve Thana Dayajoopi - Manalan Kshamiyinchenugaa Premagala Maa Thandrivi 5. Neeve Maa Durgamunu - Kedemu Neeve Ninnu Memu Nammiyunnaamu - Maaku Sarvamu Neeve Memu Needu Prajalamu