యెహోవాను స్తుతించుడి మీరు - YouWorship
Yehovaanu Sthuthinchudi Meeru
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యెహోవాను స్తుతించుడి - మీరు యెహోవా నామమును స్తుతియించుడి (1) అను పల్లవి: యెహోవా సేవకులారా - మీరు స్తుతించుడి (2) || యె || 1. యెహోవా మందిర పునాదిని వేసిన - దినమున పలికిన ప్రవక్తల మాటన్ (2) నేటి దినమున వినెడి మీరు (2) ధైర్యము తెచ్చుకొనుడనె ప్రభువు (1) 2. పూర్ణ మనస్సుతో సేవించు భక్తుల - కరుణతో తన కృప జూపుట మరువని నిబంధన నెరవేర్చు నీవంటి దేవుడు భూమ్యాకాశములందున లేడని 3. ఇల దావీదను పితరుని తోడ - సెలవిచ్చిన మాట నెరవేర్చెను ప్రభు సొలొమోను నందా వాగ్దానములను కన్నుల విందుగ నెరవేర్చెనుగా 4. పోవుడి, పోవుడి, తొలగిపోవుడి అపవిత్రమైన దేని ముట్టకుడి యెహోవా సేవోప కరణములను మోయు వారలగు మీరు శుద్ధి చేసికొనుడి 5. ఆలకించుడి మీరు తన సేవకుడు - వివేకముగా ప్రవర్తించును గాన ఉన్నతమైన స్థానమందుండి ఘనుడైనవాడై హెచ్చింపబడును 6. పర్వతములపై ఎంతో సుందరములు - రాజ్య సువార్తను చాటించువారై సీయోను! నీ దేవుడేలు చున్నాడని సమాధానమును ప్రకటించు పాదములు 7. ఆ నగరములో నుండదు శాపము - దేవుని గొఱ్ఱపిల్ల సింహాసనముండు సేవింతురు తన దాసులాయనను రవి తేజులై దివి రాజ్యమునందు Pallavi: Yehovaanu Sthuthinchudi - Meeru Yehovaa Naamamunu Sthuthiyinchudi (1) Anu Pallavi: Yehovaa Sevakulaaraa - Meeru Sthuthinchudi (2) || Ye || 1. Yehovaa Mandira Punaadini Vesina - Dinamuna Palikina Pravakthala Maatan (2) Neti Dinamuna Vinedi Meeru (2) Dhairyamu Thechchukonudane Prabhuvu (1) 2. Poorna Manassutho Sevinchu Bhakthula - Karunatho Thana Krupa Jooputa Maruvani Nibandhana Neraverchu Neevanti Devudu Bhoomyaakaashamulanduna Ledani 3. Ila Daaveedanu Pitharuni Thoda - Selavichchina Maata Neraverchenu Prabhu Solomonu Nandaa Vaagdaanamulanu Kannula Vinduga Neraverchenugaa 4. Povudi, Povudi, Tholagipovudi Apavithramaina Deni Muttakudi Yehovaa Sevopa Karanamulanu Moyu Vaaralagu Meeru Shuddhi Chesikonudi 5. Aalakinchudi Meeru Thana Sevakudu - Vivekamugaa Pravarthinchunu Gaana Unnathamaina Sthaanamandundi Ghanudainavaadai Hechchimpabadunu 6. Parvathamulapai Entho Sundaramulu - Raajya Suvaarthanu Chaatinchuvaarai Seeyonu! Nee Devudelu Chunnaadani Samaadhaanamunu Prakatinchu Paadamulu 7. Aa Nagaramulo Nundadu Shaapamu - Devuni Gorrapilla Sinhaasanamundu Sevinthuru Thana Daasulaayananu Ravi Thejulai Divi Raajyamunandu