యెహోవాను నమ్ముకొను మానవులు - YouWorship
Yehovaanu Nammukonu Maanavulu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యెహోవాను నమ్ముకొను మానవులు ఈ మహిలోన ధన్యులు (2) ఆయనపై నిరీక్షణను నుంచువారు ధన్యులు వారు (1) 1. జలము యొద్ద నాటబడిన - చెట్టువలె అది యుండును (2) కాల్వల యోరను వేళ్లు తన్నును - కదలదు తుఫాను గాలులున్న (2) 2. వెట్ట కలిగినను భయపడదు - ఆకులు పచ్చగా నుండును వర్షములేని సంవత్సరమున - చింతించదు కాపు మానదు 3. హృదయము అన్నిటికంటే - బహు మోసకరమైనది అది ఘోరమైన దుష్టత్వమైనది - దీని నెరుగువారెవ్వరు 4. యెహోవా నగు నేను పరీక్షింతు - అందరి అంతరీంద్రములను ప్రతివాని క్రియల ప్రవర్తనను బట్టి - నేను ప్రతిఫలమిత్తును 5. ఓ యెహోవా పరమ తండ్రి - ఇశ్రాయేలాధారుడా నిన్ను విసర్జించు వారందరిలలో - సిగు నొందెదరు గాక 6. ద్రోహులు నన్ను విసర్జించిరి - జీవ జల ఊటనైన నన్ను ఇసుక మీద పేరు వ్రాయ బడినట్లు - అట్టివారి పేరు నుండుగా 7. దేవా నన్ను స్వస్థపరచు - నేను స్వస్థత నొందెదను దేవా రక్షించుము రక్షింప బడుదును - నా సోత్రములకు ఆధారుడా Pallavi: Yehovaanu Nammukonu Maanavulu Ee Mahilona Dhanyulu (2) Aayanapai Nireekshananu Nunchuvaaru Dhanyulu Vaaru (1) 1. Jalamu Yodda Naatabadina - Chettuvale Adi Yundunu (2) Kaalvala Yoranu Vellu Thannunu - Kadaladu Thuphaanu Gaalulunna (2) 2. Vetta Kaliginanu Bhayapadadu - Aakulu Pachchagaa Nundunu Varshamuleni Sanvathsaramuna - Chinthinchadu Kaapu Maanadu 3. Hrudayamu Annitikante - Bahu Mosakaramainadi Adi Ghoramaina Dushtathvamainadi - Deeni Neruguvaarevvaru 4. Yehovaa Nagu Nenu Pareekshinthu - Andari Anthareendramulanu Prathivaani Kriyala Pravarthananu Batti - Nenu Prathiphalamiththunu 5. O Yehovaa Parama Thandri - Ishraayelaadhaarudaa Ninnu Visarjinchu Vaarandarilalo - Sigu Nondedaru Gaaka 6. Drohulu Nannu Visarjinchiri - Jeeva Jala Ootanaina Nannu Isuka Meeda Peru Vraaya Badinatlu - Attivaari Peru Nundugaa 7. Devaa Nannu Svasthaparachu - Nenu Svasthatha Nondedanu Devaa Rakshinchumu Rakshimpa Badudunu - Naa Sothramulaku Aadhaarudaa