యెహోవాను గానము చేసెదము యేకముగా - YouWorship
Yehovaanu Gaanamu Chesedamu Yekamugaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యెహోవాను గానము చేసెదము యేకముగా (1) మనకు రక్షకుడాయనే - ఆయన మహిమ పాడెదము (1) ఆయనను వర్ణించెదము - ఆయనే దేవుడు మనకు (1) 1. యుద్ధశూరుడెహోవా - నా బలము నా గానము (2) నా పితరుల దేవుడు - ఆయన పేరు యెహోవా (2) 2. ఫరోరథముల సేనలను - తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన - ముంచివేసె నెహోవా 3. నీ మహిమాతిశయమున - కోపాగ్ని రగులజేసి చెత్తవలె దహించెదవు - నేపై లేచువారిని 4. దోపుడు సొమ్ము పంచుకొని - ఆశ తీర్చుకొందును నా కత్తి దూసెదను - అని శత్రువనుకొనెను 5. వేల్పులలో నీ సముడెవడు - పరిశుద్ధ మహానీయుడా అద్భుతమైన పూజ్యుడా - నీవంటి వాడెవడు 6. ఇశ్రాయేలీయులంతా - ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యను - ఆరిన నేలను నడచిరి Pallavi: Yehovaanu Gaanamu Chesedamu Yekamugaa (1) Manaku Rakshakudaayane - Aayana Mahima Paadedamu (1) Aayananu Varninchedamu - Aayane Devudu Manaku (1) 1. Yuddhashoorudehovaa - Naa Balamu Naa Gaanamu (2) Naa Pitharula Devudu - Aayana Peru Yehovaa (2) 2. Pharorathamula Senalanu - Thana Shreshthaadhipathulanu Erra Samudramulona - Munchivese Nehovaa 3. Nee Mahimaathishayamuna - Kopaagni Ragulajesi Cheththavale Dahinchedavu - Nepai Lechuvaarini 4. Dopudu Sommu Panchukoni - Aasha Theerchukondunu Naa Kaththi Doosedanu - Ani Shathruvanukonenu 5. Velpulalo Nee Samudevadu - Parishuddha Mahaaneeyudaa Adbhuthamaina Poojyudaa - Neevanti Vaadevadu 6. Ishraayeleeyulanthaa - Entho Surakshithamugaa Samudramu Madhyanu - Aarina Nelanu Nadachiri