యెడతెగక ప్రార్థించుము - YouWorship
Yedathegaka Praarthinchumu
Artist: సీయోను గీతాలు
Category: Prayer
Song Lyrics
పల్లవి: యెడతెగక ప్రార్థించుము (2) - మెలకువతో కొనసాగుము (1) యెడతెగక ప్రార్థించుము (1) 1. క్రీస్తుని ఉపదేశమును పొంది (2) - ఆయన మాదిరి మదియందుంచి (2) ప్రార్థించుము - కౄతజ్ఞతతో (2) - ఆనంద గీతము పాడుచును (2) 2. ఆయన రాకడ సమీపము - అర్థరాత్రో కూడి కూయునపుడో గమనిక లేనివానివలె నుండిన - యజమానుని శిక్షకు గురి యగుదువు 3. ఉగ్రత నుండి తప్పించు యేసు - ప్రత్యక్షమౌను పరమందుండి ఉపద్రవమందు పొందిన రక్షణ - కాపాడుకొనన్ నీ ఆత్మయందు 4. మీరేగదా మాదు నిరీక్షణ - ఆనందమును అతిశయమని ప్రేమతో ప్రయాస మొందునట్టి - దైవజనుల పోలి నడువంగను 5. విశ్వాసమందున్న లోపములను - సరిదిద్దుటకు కృపను పొంద ప్రార్థించు సేవకుల ప్రేమను చూచి - వేదనతో వేడు శక్తిని పొంద 6. ప్రధానదూత శబ్దమును - దేవుని బూర ద్వనిని వినగా క్రీస్తునందుండి మృతులైనవారు - లేతురు మొదట మనకన్న ముందు 7. నిద్రపోక భద్రముగా నుండ - భారముతో వేడుము ప్రభు శక్తిని ఎత్తబడరు మత్తులైనవారు - మెలకువతో వేడు ఉజ్జీవాత్మకై 8. మీ ఆత్మజీవమును రాకడయందు - నిందారహిత సంపూర్ణతతో సమాధాన కర్తన్ ప్రార్థించుము - కాపాడబడను పరిశుద్ధతలో Pallavi: Yedathegaka Praarthinchumu (2) - Melakuvatho Konasaagumu (1) Yedathegaka Praarthinchumu (1) 1. Kreesthuni Upadeshamunu Pondi (2) - Aayana Maadiri Madiyandunchi (2) Praarthinchumu - Kroothagnathatho (2) - Aananda Geethamu Paaduchunu (2) 2. Aayana Raakada Sameepamu - Artharaathro Koodi Kooyunapudo Gamanika Lenivaanivale Nundina - Yajamaanuni Shikshaku Guri Yaguduvu 3. Ugratha Nundi Thappinchu Yesu - Prathyakshamaunu Paramandundi Upadravamandu Pondina Rakshana - Kaapaadukonan Nee Aathmayandu 4. Meeregadaa Maadu Nireekshana - Aanandamunu Athishayamani Prematho Prayaasa Mondunatti - Daivajanula Poli Naduvangganu 5. Vishvaasamandunna Lopamulanu - Sarididdutaku Krupanu Ponda Praarthinchu Sevakula Premanu Choochi - Vedanatho Vedu Shakthini Ponda 6. Pradhaanadootha Shabdamunu - Devuni Boora Dvanini Vinagaa Kreesthunandundi Mruthulainavaaru - Lethuru Modata Manakanna Mundu 7. Nidrapoka Bhadramugaa Nunda - Bhaaramutho Vedumu Prabhu Shakthini Eththabadaru Maththulainavaaru - Melakuvatho Vedu Ujjeevaathmakai 8. Mee Aathmajeevamunu Raakadayandu - Nindaarahitha Sampoornathatho Samaadhaana Karthan Praarthinchumu - Kaapaadabadanu Parishuddhathalo